సాధారణంగా హీరోయిన్స్ స్టార్ హీరోలతో సినిమా అంటే రిజెక్ట్ చేయరు. అది ఎందుకో కూడా మనందరికీ తెలుసు.. క్రేజ్.. పాపులారిటీ.. ఫ్యాన్ బేస్ ..ఆటోమేటిక్గా వస్తాయి . ఒక్క సినిమా హిట్ అయిందా చాలు ఇక ఆ సినిమా హిట్ తో వచ్చే ఆఫర్లు అన్నీ ఇన్ని కాదు ..కొన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాదు .. అలాంటి అవకాశం కోసం ఏ ముద్దుగుమ్మయిన ఎదురుచూస్తూ ఉంటుంది . ఆ అవకాశం వస్తే ఎవ్వరు కూడా మిస్ చేసుకోరు . కానీ ఓ హీరోయిన్ మాత్రం చేజేతులారా ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంది.. ఆమె మరెవరో కాదు ఆలియా భట్.
ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అలియాబట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే.. తెలుగులోనే ఆమెకు పది సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి . ఫైనల్లీ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆ ముచ్చట తీర్చుకునింది . అయితే ఈ సినిమాలో కంటే ముందే ఆమెకు పలు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆమె కొన్ని కారణాల చేత మిస్ చేసుకుందట. తెలుగులో మొత్తంగా మూడుసార్లు ఎన్టీఆర్ నటించే సినిమాలలో అవకాశం అందుకుందట.
కానీ ఆమెకు కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా కొన్నిసార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అన్న కాన్సెప్ట్ తో సినిమా అవకాశాలను వదులుకుందట . ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలియా ఈ విషయాన్ని బయటపెట్టింది . అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది ఆలియా భట్ . దేవర సినిమాలో కూడా నిజానికి హీరోయిన్ గా అలియా భట్ నే అనుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది..!!