ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ ఎక్కువగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో బన్నీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనకు తెలుసు.. కాగా బన్నీ పేరు ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతుంది.. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏపీ పాలిటిక్స్.. శుభ్రంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు బన్నీ.. ఫ్రెండ్షిప్ కోసం అంటూ వైసీపీ పార్టీ క్యాండిడేట్ కు సపోర్ట్ చేశారు . అయితే ఆయన ఓడిపోవడమే కాకుండా బన్నీ కూడా లైఫ్లో కష్టాలు ఎదుర్కొనేలా సమస్యలు తెచ్చిపెట్టాడు . మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత వైసిపి కాండిడేట్ కోసం ప్రచారం చేయడానికి వెళ్ళాడు బన్నీ. ఇది ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది.
దీంతో సోషల్ మీడియాలో బన్నీను మెగా అభిమానులు ఏకిపారేశారు . కాగా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామంటూ కూడా ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు . ఇదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సైతం టిడిపికి సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు . బన్నీ రూట్ అయినా వేరే ఆయనకు జనసేనతో దూరపు సంబంధం . కానీ ఎన్టీఆర్కు టిడిపికి ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందో అందరికీ తెలుసు . చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని తప్పుడు మాటలు అన్నప్పుడు ..అస్సలు రెస్పాండ్ అవ్వలేదు జూనియర్ ఎన్టీఆర్ ..
కానీ ఏపీ గవర్నమెంట్ ఫార్మ్ చేసే ముందు గెలిచిన వాళ్లకు విష్ చేశారు . బన్నీ కూడా జనసేన పార్టీ తరపున గెలిచిన పవన్ కళ్యాణ్ కు విష్ చేశాడు. అంతే దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళిద్దరిని ట్రోల్ చేస్తున్నారు జనాలు .బన్నీకి దూకుడు తనం ఎక్కువ అని ముందు వెనక ఆలోచించడు అని.. ఎన్టీఆర్ కి మొండితనం ఎక్కువ అని గతంలో జరిగిన అవమానాలను గుర్తుచేసుకొని ప్రజెంట్ మర్చిపోతున్నాడు అని ..ఇద్దరికీ ఉన్న ఆ క్వాలిటీ నే ఇప్పుడు వీళ్ళు కష్టాలు ఎదుర్కొనేలా చేయబోతుంది అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఇద్దరి టైం ఎలా ఉండబోతుందో..??