అలా చేసి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్స్ వీళ్ళే.. అందరిలో అదే క్వాలిటీ..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటూ చాలామంది అమ్మాయిలు ఆశ పడుతూ ఉంటారు . అయితే అది అనుకున్నంత ఈజీ విషయం కాదు అన్న విషయం కూడా అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే కొన్ని కొన్ని శాక్రిఫైజ్ లు చేయాలి. కొంతమంది అవి ఇష్టంగా చేస్తారు మరి కొంతమంది బలవంతంగా చేస్తారు . ఇష్టంగా సాక్రిఫైజ్ చేసిన బలవంతంగా సాక్రిఫైజ్ చేసిన ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్గా మారాలి అంటే బోల్డ్ నెస్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అయితే కొన్ని కొన్ని సార్లు అదృష్టం కలిసి రాక పదేపదే కష్టాలు కూడా పడుతూ ఉంటారు . చేతికి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోతూ ఉంటాయి. అయినా సరే కెరియర్ స్టార్టింగ్ లో ఫ్లాప్స్ అందుకొని ఆ తర్వాత హిట్స్ అందుకున్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. ఆ లిస్టులోకే వస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్స్..!!


పూజా హెగ్డే : ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పూజ హెగ్డే ఎన్ని ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకుందో లెక్కలేదు.. బడా బడా స్టార్ సినిమాలో నటించిన సరే హిట్స్ అందుకోలేకపోయింది . ఒకానొక టైం లో అయితే ఇండస్ట్రీకి దూరం అయిపోతుందేమో అని కూడా అనుకున్నారు జనాలు.. ఫైనల్ గా ఎలాగోలా అరవింద సమేత వీర రాఘవ ..దువ్వాడ జగన్నాథం సినిమాలతో హిట్ అందుకొని హిట్ హీరోయిన్గా మారిపోయింది.


శృతిహాసన్: కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది .కానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కెరియర్ స్టార్టింగ్ లో తన ఖాతాలో వేసుకోలేకపోయింది .ఆ తర్వాత ఫైనల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమా తర్వాత శృతిహాసన్ రేంజ్ ఏ విధంగా మారిపోయింది అనేది అందరికీ తెలిసిందే..!!


దీక్షాసేధ్: ఇండస్ట్రీలో టాలెస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది ..చక్కగా ఉంటుంది ..అందంగా మాట్లాడుతుంది ..అంతకుమించిన బోల్నెస్ను కూడా ప్రదర్శిస్తుంది.. కానీ ఎందుకో అవకాశాలు అందుకుంటున్న సరే హిట్స్ మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయింది .. ఒకటి కాదు రెండు కాదు బడా బడా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించిన ఆమె హిట్స్ అందుకోలేకపోయింది . ఆశ్చర్యం ఏంటంటే ఆమెతో నటించిన హీరోలందరూ కూడా ఫ్లాప్స్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంది.


ప్రియమణి : ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ తో దున్నేస్తున్న ప్రియమణి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏ రేంజ్ లో అల్లాడించిందో అందరికీ తెలిసిందే.. ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి కెరియర్ స్టార్టింగ్ లో చాలా చాలా ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత ఒక్కొక్కసారి కథలోని కంటెంట్ విషయంలో మార్పులు తీసుకొస్తూ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకొని హిట్స్ తన ఖాతాలో వేసుకుంది..!!