వావ్: కల్కి సీక్వెల్లో పరుశు రాముడి పాత్రలో కనిపించనున్న ఆ స్టార్ హీరో..నాగి ప్లాన్ అదుర్స్.. అంతే..!

ప్రభాస్ ..తాజాగా నటించిన సినిమా కల్కి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . మొదటి రోజే ఏకంగా 180 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో పరశురాముడు పాత్ర కోసం ఒక స్టార్ హీరోని నాగ్ అశ్వీన్ అప్రోచ్ అయినట్లు సినీ వర్గాల నుంచి ఓ సమాచారం అందుతుంది. నాగ్ అశ్వీన్ తనదైన విజన్ తో ఓ సపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి మరి జనాలను తన మైండ్ అర్ధం చేసుకునే విధంగా కలికి సినిమాని తెరకెక్కించారు.

మహాభారతానికి కలియుగాంతానికి లింక్ పెడుతూ నేటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ కల్కి సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు . ఈ క్రమంలోనే కల్కి 2 లో కూడా ప్రతి ఒక్క పాత్రను అంతే రియలిస్టిక్ గా తెరకెక్కించబోతున్నారట . కల్కి 2 సినిమాలో పరశురాముడు పాత్ర కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించిపోతున్నారట . మొదటి పార్ట్ లో అశ్వద్ధామ ఎలాగైతే కల్కిని కాపాడుకుంటూ వచ్చాడో..

ఇక రెండవ పార్ట్ లో పరశురాముడు కల్కి కి సరైన యుద్ధ విద్యలను నేర్పే విధంగా యుద్ధానికి సిద్ధం చేసే విధంగా తన క్యారెక్టర్ ని డిజైన్ చేయబోతున్నాడట . సోషల్ మీడియాలో ప్రజెంట్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాత్ర కోసం చిరంజీవిని అప్రోచ్ అవ్వగా ఆయన ఓకే చేశారట. ఇక ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి..!!