“కల్కి” సెకండ్ డే కలెక్షన్స్: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్..ఈ రేంజ్ లో పడిపోయాయి ఏంటి..?

మొదటి రోజు సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేసిన నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన కల్కి సినిమా రెండవ రోజు మాత్రం అభిమానులను కూసింత బాధ పెట్టింది అని చెప్పాలి . మొదటిరోజు ఏకంగా 180 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా రెండవ రోజు సగానికి పైగా షేర్స్ పడిపోవడం అభిమానులకు తీవ్ర హర్టింగ్గా అనిపించింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే .

మొదటి షో తోనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు తనదైన స్టైల్ లో ప్రభాస్ నటించి జనాలను బాగా ఆకట్టుకున్నాడు . ఫస్ట్ డే కలెక్షన్స్ ఫుల్ ఓ రేంజ్ లో కుమ్మి పడేసిన ప్రభాస్ సెకండ్ డే మాత్రం కూసింత డౌన్ ఫాల్ అయ్యే విధంగానే కలెక్షన్స్ రాబట్టడం అందరికీ షాకింగ్ గా ఉంది . సెకండ్ డే లెక్కల వివరాలకు వస్తే..

రెండో రోజు ఇండియాలో రూ.50 కోట్ల వరకు నెట్​ వసూళ్లే వచ్చాయి. ఇందులో తెలుగు నుంచి రూ.24.65 కోట్లు, తమిళం(రూ.3.5 కోట్లు), హిందీ(రూ.20.5 కోట్లు), కన్నడ(0.3 కోట్లు), మలయాళం(రూ.2 కోట్లు) వచ్చినట్లు పేర్కొంది. అయితే ఎలాగో వీకెండ్ వచ్చింది కాబట్టి శని, ఆదివారాల్లో మళ్లీ ఈ కలెక్షన్లు రెట్టింపు అవ్వొచ్చని అంతా అంచనా వేస్తున్నారు. దీంతో వీకెండ్ ముగిసేసరికి ఏ రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్స్ ఉంటాయా..? అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..!!