రాజకీయాలకు గుడ్ బై చెప్పిన అలీ.. ఏ పార్టీ వాడిని కాదంటూ షాకింగ్ కామెంట్స్..?!

2019 ఎన్నికల్లో వైసీపీలో సినీ నటుడు అలీ చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పార్టీ ప్రచారంలో కూడా పాల్గొని సందడి చేశాడు. అయితే తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఓ వీడియోను రిలీజ్ చేశాడు ఈ స్టార్ కమెడియన్. 1990లో రాజకీయాల్లోకి అడుగు పెట్టానని చెప్పుకోచ్చిన ఆయ‌న‌ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తర్వాత.. సెకండ్ ఇన్నింగ్స్ కు అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసం.. నేను అప్పట్లో రాజకీయాల్లో అడుగుపెట్టానని.. చెప్పుకొచ్చాడు. ఆయన బాపట్లలో ఎంపీగా నిలబడినప్పుడు.. నువ్వు వచ్చి ప్రచారం చేయాలని అడగగా.. టీడీపీలో చేరానని ఆయన చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళు అందులో పనిచేశానని.. తర్వాత వైసీపీలోకి వచ్చాను అంటూ వివరించాడు.

ఇక తనకు అన్నం పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ అని.. 45 ఏళ్లలో ఆరు భాషల్లో 1200 కు పైగా సినిమాల్లో నటించాలని వివరించాడు. నాకు ఎంతో కొంత భగవంతుడి అనుగ్రహం ఉంది.. దానికి రాజకీయ బలం తోడైతే ఇంకా సేవ చేయొచ్చని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప‌.. రాజకీయం చేయాలని రాలేదంటూ వివరించాడు. మా నాన్న పేరుతో ట్రస్ట్ పెట్టి కరోనాలో కూడా ఆపకుండా పదహారేళ్లుగా సేవ చేస్తూనే ఉన్నామని.. ఆ ట్రస్ట్ ద్వారా నేను ఎంతోమందిని చదివించాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ నేతలను పొగుడుతా.. కానీ ఇతర పార్టీల నేతలు ఎప్పుడూ విమర్శించలేదు.. దూషించలేదు.. ఈ క్ర‌మంలో మీరు వెతికినా నేను ఎవరిని దూషించిన వీడియో దొరకదు అంటూ అలి చెప్పుకొచ్చాడు.

No Campaign For YCP Party From Actor Ali This Time? | No Campaign For YCP  Party From Actor Ali This Time?

ఇప్పుడు నేను ఏ పార్టీలోను లేను.. ఏ పార్టీ సపోర్టర్ ని కాదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇక‌ పై సినిమాలు షూటింగ్స్ మాత్రమే నేను చూసుకుంటానని.. ఈ మాట చెప్పడానికే మీ ముందుకు వచ్చాను అంటూ వీడియోలో వివరించాడు. నేను కూడా మీలాగే ఒక కామన్ మ్యాన్ లాగా ఐదేళ్లకు ఒకసారి వెళ్లి ఓటు వేసి వస్తా అంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా అంటూ వివరించాడు. ఇక గత వైయస్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా ఆలి వ్యవహరించిన సంగతి తెలిసిందే.