తెలుగు సినీ చరిత్రలో ఏకైక స్టార్ హీరోగా ప్రభాస్ ఊరమాస్ రికార్డ్.. అదేంటంటే..?!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన భారీ మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీ. భారీ తారాగణంతో.. అత్యధిక బడ్జెట్లో.. హాలీవుడ్ విజువల్స్ తలపించేలా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రూ.700 కోట్ల బడ్జెట్లో తెర‌కెక్కిన ఈ సినిమా.. మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.191.5 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. సినిమాను థియేటర్లలో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది.

Kalki 2898 AD - Wikipedia

ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ క్రియేట్ చేసిన ఓ రేర్‌ రికార్డ్ ఇప్పటివరకు.. మరెవరు క్రియేట్‌ చేయలేదంటూ వార్త‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. ప్రభాస్ ఇప్పటి వరకు రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ‌ను మొద‌టిరోజే ఐదుసార్లు రాబట్టిన ఏకైక హీరోగా రికార్డ్ ను సృష్టించాడు. నిజంగా ఇది ప్రభాస్ సృష్టించిన ఊర‌మాస్‌ రికార్డ్ అని చెప్పడంలో సందేహం లేదు. ప్రభాస్ హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనాలు క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. నాలుగో సారి రూ.20 కోట్లకు పైగా నెట్ వసూళ‌ను రాబట్టిన హీరోగా ప్రభాస్ ఘనత సాధించాడు.

If Not Prabhas, Who Is The Real Kalki?

కల్కి సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ.22.50 కోట్ల వాసులను కొల్లగొట్టింది. ఈ సినిమా లాంగ్ రాన్‌లో మ‌రిన్ని భారీ వసూళ‌ను రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశ పటాన్ని, కమలహాసన్, అమితబ‌చ్చ‌న్‌, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన, మాళవిక నాయ‌ర్‌, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో మెప్పించారు. అలాగే రాజమౌళి, ఆర్జీవి కూడా గెస్ట్ రోల్ లో మెరిసారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ముందు ముందు ప్ర‌భాస్ ఈ మూవీతో మరెని రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.