తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల రిజల్ట్స్ వెలువడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయ భేరి మోగించాడు. ఏకంగా 70,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆమె ఓ సెలబ్రిటీ అయి ఉండి.. పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఆయన ఎన్నికల్లో విజయం సాధించలేడు.. ఆయాస పడడం, కోపం తప్ప ఆయనకు ఇంకేమీ రాదు అంటూ చెప్పుకొచ్చింది.
పవన్ రాజకీయాలకు అసలు పనికిరాడని.. వైసీపీనే ఈసారి ఎన్నికల్లో సక్సెస్ సాధిస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో సక్సెస్ సాధించడం.. అలాగే ఎవరు గెస్ కూడా చేయలేని విధంగా ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయభేరి మోగించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ యాంకర్ శ్యామలను ఉద్దయేశించి షాకింగ్ ట్విట్ చేశారు.
అఆ.. సినిమాలోని వెళ్లిపోకే శ్యామల.. ఏమి బాగోలేదు అసట.. అనే సాంగ్ ట్విట్ చేస్తూ.. జనసేనని విజయం సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఎస్కేయన్ చేసిన ఈ పోస్ట్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక పవన్ అసెంబ్లీలో అడుగు పెడుతున్న క్రమంలో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
వెళ్లిపోకే శ్యామల ఏమి బాగ లేదు లోపల https://t.co/NA0VgMsEqp
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) June 4, 2024