ప్రెసెంట్ ఏపీ పొలిటికల్ చరిత్రలో పవన్ కళ్యాణ్ పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది . ఎప్పుడు లేని విధంగా ఈసారి పొలిటికల్ ఫై సినీ ప్రభావం ఎక్కువగా చూపుతూ ఉండడంతో సినీ రంగంలో ఉండే స్టార్స్ కూడా ఏపీ రాజకీయాలపై బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం సంచలనంగా మారింది .
అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చి పిఠాపురంలో ప్రచారం చేసింది నాగబాబు.. నాగబాబు భార్య పద్మజ .. నాగబాబు కొడుకు .. వరుణ్ తేజ్ హీరో సాయిధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ .. రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు . చిరంజీవి సైతం స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ దాదాపు 74 వేల ఓట్ల మెజారిటీతో వంగా గీతాపై ఘనవిజయం సాధించారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పవన్ గెలుపు సంచలనంగా మారింది . పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం పై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కోసం చాలా కష్టపడ్డారు .. ఎన్నికల ఫలితాలు పిఠాపురంలో లైవ్ స్క్రీన్పై చూసిన పవన్ సోదరుడు నాగబాబు సోదరి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినవో.. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ అభిమానులకు థాంక్స్ చెప్పారు .. ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ కొడుకు సేమ్ తండ్రిలాగే జనసేన పిడికిలి చూపించి విన్నింగ్ మూమెంట్లు ఎంజాయ్ చేశారు . దీనికి సంబంధించిన పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయ్..!!