‘ మనమే ‘ మూవీలో నటించిన ఈ బుడ్డోడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..?!

ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ ఆకట్టుకున్న లేటెస్ట్ ట్రైలర్స్ లో మనమే మూవీ ట్రైలర్ ఒకటి. శర్వానంద్, కృతి శెట్టి జంటగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు శ్రీ రామ్ అదిత్యా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ క్ర‌మంలో ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. కాగా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టడం వీరిద్దరికీ చాలా అవసరం. అయితే తాజాగా వ‌చ్చిన ట్రైల‌ర్‌తో ఈ సారి వీళ్ళిద్ద‌రు సక్సెస్ కొడతారు అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ మూవీ ట్రైలర్ లో శర్వానంద్, కృతి శెట్టిల మధ్యన మెరిసిన ఓ బుడ్డోడు విక్రమ్ ఆదిత్య.. చూడడానికి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా నటించాడు. దీంతో ఆ చిన్ని బాబు ఎవరి పిల్లాడు.. వాడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే ప్ర‌శ్న‌లు నెటింట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కాగా ఆ బాబు పేరు విక్రమ్ ఆదిత్య. అత‌ను ఎవరో కాదు ఈ మూవీ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తనయుడు.

Manamey Movie Child Artist : శర్వానంద్, కృతిశెట్టితో కలిసి నటించిన ఈ బాబు ఎవరో తెలుసా..? ఆ డైరెక్టర్ కొడుకే ఇలా.. | Sharwanand krithi shetty manamey movie child artist details here-10TV ...

లాంగ్ హెయిర్ తో ఈ బుడ్డోడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. 2020లో శ్రీరామ ఆదిత్య దంపతులకు ఈ విక్రమ్ ఆదిత్య జన్మించాడు. ప్రస్తుతం ఇతని వయసు నాలుగు సంవత్సరాలట‌. ఇక శ్రీరామ్ ఆదిత్య ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అలాగే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో శ్రీరామ్ మరోసారి సక్సెస్ సాధిస్తే తనకు మరిన్ని భారీ ప్రాజెక్టులలో అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.