ముంబైలో జరిగిన “కల్కి” ఈవెంట్ కు..దిశాపటాని రాకపోవడం వెనక అంత పెద్ద కారణం ఉందా..?

కల్కి ..టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా . కేవలం కొద్ది రోజులే .. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులు స్టార్ట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్వీన్. తాజాగా ముంబైలో ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ను టాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు గా పాపులారిటి సంపాదించుకున్న రానా దగ్గుబాటి హోస్ట్ చేశారు .

చాలా స్టైల్గా తనదైన స్టైల్ టాకింగ్ తో ఆకట్టుకున్నాడు . అయితే ఈవెంట్ కోసం బేబీ బంప్ తో ఉన్న దీపికా పదుకొనే అలాగే స్టార్ హీరో ప్రభాస్ లెజెండరీ యాక్టర్లు అమితాబచ్చన్ – కమలహాసన్ లాంటి వాళ్లు హాజరయ్యారు . అయితే ఇంకొక హీరోయిన్ దిశా పటాన్ని ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దిశా పటాన్ని ఎందుకు రాలేదు ..? కల్కి సినిమా ప్రమోషన్స్ లో ఎందుకు భాగం కాలేదు ..?అంటూ ప్రశ్నిస్తున్నారు .

అయితే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా చిన్నది అని..అందుకే ఆమె ఇ ఇన్వాల్వ్ చేయలేదు అని అంటున్నారు. కొంతమంది ఆమె ముంబైలో లేదు అంటూ చెప్పుకొస్తుంటే మరి కొంత మంది మాత్రం ఆమె ముంబైలోనే ఉంది అని కానీ ఆమె ఈవెంట్ కి హాజరు కాలేదు అని ప్రచారం చేస్తున్నారు, నిజానిజాలు తెలియాలి అంటే దిశ పటాని లేదా కల్కి టీం నోరు విప్పాల్సిందే..!!