ఆ విషయంలో సైలెంట్ గా ఉన్న రామ్ చరణ్ ..తెరవెనక ఏం జరుగుతుంది..?

రామ్ చరణ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నాడు. ఆయన ఆఖరిగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ .దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోట్లాదిమంది ఇండియన్స్ ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డును సైతం ఇండియాకి తీసుకొచ్చింది . ఆ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటించాడు.

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ప్రారంభించింది .. రీసెంట్ గానే షూట్ కంప్లీట్ చేసుకుంది . అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఏవి సరిగ్గా ఇవ్వడం లేదు అంటూ మెగా ఫాన్స్ మండిపడుతూ వస్తున్నారు.. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . రామ్ చరణ్ తోటి హీరోస్ అందరూ కూడా తమ సినిమాల విషయంలో కీలక అప్డేట్స్ ఇస్తున్నారు. తారక్-ప్రభాస్-మహేష్ బాబు -బన్నీ లాంటి వాళ్ళు తమ నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలపై పక్కా క్లారిటీతో ఉన్నారు .

అయితే రామ్ చరణ్ మాత్రం గేమ్ ఛెంజర్ విషయంలో అసలు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ లేవు. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అసలు తెరవనక ఏం జరుగుతుంది అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. రామ్ చరణ్ సైలెంట్ గా ఉంటే కుదరదు ఏదో ఒక విషయంపై రెస్పాండ్ అవ్వాలి అంటూ చెప్పుకొస్తున్నారు..!!