వామ్మో.. ఓట్స్ అధికంగా తింటే ఇంత ప్రమాదమా.. తప్పక తెలుసుకోండి..?!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో అందరూ హెల్త్ కాన్షియస్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఓట్స్ అంటే ఎవరికి తెలియదు. కానీ ప్రస్తుతం వోట్స్ అంటే హెల్దీ ఫుడ్ అని అంతా భావిస్తున్నారు. ఎంతో ఇష్టంగా వాటిని ఆస్వాదిస్తున్నారు. అయితే చాలామంది డైట్ లో బరువు తగ్గించుకోవడానికి ఓట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఓట్స్ ఆరోగ్యానికి మంచి ఫుడ్ అని అనడంలో సందేహం లేదు. కానీ ఎక్కువగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ అధికంగా తింటే అంతే హానికరమని అంటున్నారు. ఓట్స్ అధికంగా తినడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయట.

ఓట్స్‌లో ఉన్న ఫైబర్ జీర్ణ క్రియను ఎంతగానో మెరుగుపరిస్తుంది. కానీ ఇది కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అంతేకాదు కొంతమంది కడుపునొప్పి, మలబద్ధకం కి కూడా ఇది కారణమవుతోంది. అంతేకాదు ఈ ఓట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మ‌రిని దుష్ప్రభావాలు క‌లుగుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఓట్స్‌ను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంటారు. ఇది పోషకాహారం. ప్రధానంగా ఓట్స్ కార్బోహైడ్రేట్లను కలిగి ఉండడంతో.. చాలా ప్రయోజన కారిగా ఉంటుంది. అయితే కొంతమందికి ఓట్స్‌ తినడం వల్ల వాపు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తుతాయి. మామూలుగా రోజుకి ఒక కప్పు ఓట్స్‌ని తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారంతో ఓట్స్ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఫైబర్ మరియు ఇతర పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. అయితే వీటిని తయారు చేసేటప్పుడు కొవ్వు లేక చెక్కరను అస్సలు వాడకూడదు. ఇలా చేయడం వల్ల క్యాలరీల కంటెంట్ అనేది పెరిగిపోతుంది. అంతేకాదు కొంతమంది ఓట్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఓట్స్ అనేవి గ్లూటన్ రహితంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు కర్మ గారాల్లో ఓట్స్ ప్రాసెస్ చేస్తున్న వాటిని ఇతర గ్లూటేన్ కలిగినటువంటి ధాన్యాలతో కలుపుతూ ఉంటారు. వాటిలో ఉన్న గ్లోటిన్‌ జీర్ణించుకోలేని వ్యక్తులకు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.