ఇప్పటికే చాలామంది నటీనటులను స్టార్ సెలబ్రెటీల్ గా మార్చింది తెలుగు సినీ ఇండస్ట్రీ. ఇతర భాషలో ఎవరైనా అందంగా ఉండి బాగా నటిస్తున్నారంటే చాలు.. వెంటనే మన వాళ్ళు వాళ్లని తీసుకువచ్చేస్తారు. ఇలా మన ఇండస్ట్రీలో ఎక్కువగా ఏలుతున్న స్టార్ హీరోయిన్స్ అందరు ముంబై, మలయాళ, కన్నడ బ్యూటీలే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు సినిమా లెవెల్ మరింతగా పెరిగింది. అందుకే హాలీవుడ్ నుంచి కూడా హీరోయిన్స్ ను రప్పిస్తున్నారు మేకర్స్.
కాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ పాప ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్. ఆమెది మన దేశమే కాదు. కానీ ఇక్కడే సెటిల్ అయింది. బాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పేరు వింటే కుర్రాళలో ఒక వైబ్రేషన్ వస్తుంది. ఒక రకంగా కోట్లాదిమంది యువకుల ఆరాధ్య దేవత అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం స్టార్ గా అదరగొడుతున్న ఈ అమ్మడు ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు పాన్ ఇండియన్ బ్యూటీ సన్నీ లియోన్. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
మొదట అడల్ట్ ఫిలిమ్స్లో నటించిన సన్నీ.. తర్వాత ఐటెం సాంగ్స్ లో ఇండస్ట్రీకి పరిచయమైంది. మెల్లమెల్లగా హీరోయిన్గా అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటున్నా ఈ అమ్మడు.. తన గతం, రీల్ లైఫ్ పక్కన పెడితే.. మనసు మాత్రం బంగారం. నిజ జీవితంలో ఓ అనాధ పాపను దత్తత తీసుకుని సొంత కూతుర్ల సాకుతున్న సన్నీ.. ఎన్నో రకాల సోషల్ సర్వీసులను చేస్తూ చాలామందికి అండగా నిలిచింది. కరోనా టైం లో ఎంతోమంది అన్నార్తుల ఆకలి తీర్చింది. ఇక సన్నిలియోన్ తెలుగులో కరెంట్ తీగ, పిఎస్పీ గరుడవేగ, జిన్నా సినిమాల్లో నటించి మెప్పించింది.