పాన్ ఇండియన్ స్టార్ట్ సెలబ్రెటీస్ ప్రభాస్, దీపిక పదుకొనే జంటగా నటించిన తాజా మూవీ కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వంలో వహించిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరకెక్కనున్న ఈ సినిమాలో కమలహాసన్, దిశపటాని, శోభనా, పశుపతి, అమితాబచ్చన్ లాంటి స్టార్ సెలబ్రెటీస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో తాజాగా కల్కి మేకర్స్ ముంబైలో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్గా నిర్వహించారు. దీనికి ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక పదుకొనే బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో హాజరై ఆకట్టుకున్నారు. అయితే ఇందులో దీపిక బేబీ బంప్‌తో కనిపించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. చూడడానికి చాలా సింపుల్ లుక్‌తో ఈవెంట్ కు హాజరైనా దీపికా.. తన చేతికి ఉన్న బ్రాస్లెట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో దీపిక పెట్టుకున్న బ్రాస్లైట్ కాస్ట్ అలాగే దాని స్పెషాలిటీ గురించి నెటింట ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది.
ఆమె చేతికి ఉన్న ఆ బ్రాస్లెట్ ఏకంగా రూ. 1కోటి 16 లక్షల ఖరీదు ఉంటుందని.. దానికి కారణం ఎంతో ఖరీదైన వజ్రాలను ఇందులో పొదిగి ఈ బ్రాస్లైట్ను రూపొందించాడమేనని తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. జనం ఆశ్చర్యపోతున్నారు. అంత చిన్న బ్రాస్లైట్ కు అంత ఖరీదైన వజ్రాలతో ఏకంగా కోట్లు ఖర్చుపెట్టి మరి చేయించుకుందా అంటూ షాక్ అవుతున్నారు.