ప్రభాస్ ..పాన్ ఇండియా హీరోగా మారాడు . రెబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు . కానీ ఇప్పటికీ ప్రభాస్ మైక్ పట్టుకొని మాట్లాడే పద్ధతిని అలవాటు చేసుకోలేకపోతున్నాడు . మొదటి నుంచి ప్రభాస్ చాలా సైలెంట్ ఇంట్రోవర్ట్ అనే చెప్పాలి . చాలా చాలా సిగ్గుతో ఉంటాడు . అసలు ఆయన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడటమే పెద్ద గగనమైన విషయం . ఆది పురుష్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మనం దానికి సంబంధించిన పిక్చర్స్ ని చూసాం .. మరీ ముఖ్యంగా డార్లింగ్ మైక్ పట్టుకొని అందరిలా గలగల మాట్లాడుతూ ఉంటే చూడాలి అన్నది రెబెల్ ఫాన్స్ కోరిక ..కానీ ఆ కోరిక ఎప్పటికీ నెరవేరుతుందో..
ఫైనల్లీ కల్ కి ఈవెంట్లోనైనా అది నెరవేరుతుంది అంటూ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ కుదరలేదు . కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. రానా దగ్గుబాటి ఈ ఈవెంట్ ని హోస్ట్ చేశారు. ప్రభాస్ – అమితాబచ్చన్ – కమల్ హాసన్ హీరోయిన్ దీపికా పదుకుని ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ చేతికి మైక్ ఇస్తారు మొదటగా పక్కనే ఉన్న దీపికా పదుకొనేకు మైకు ఇచ్చిన కుర్రాడు.. ఆ తర్వాత వెంటనే ప్రభాస్ కి.. ప్రభాస్ పక్కన ఉన్న కమలహాసన్ కి మైక్ ఇస్తారు.
దీంతో ప్రభాస్ అయోమయంగా చూసిన ఎక్స్ప్రెషన్స్ బాగా వైరల్ అవుతున్నాయి . నాకెందుకురా బాబు మైకు ఇస్తున్నారు.. నేను మాట్లాడను అనేలా నాటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్స్ చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు . అంతేకాదు వెంటనే మైక్ దీపిక చేతిలో పెడదామని అటు చూశాడు ..దీపికా చేతిలో ఆల్రెడీ మైక్ ఉంది .. ఇటు పక్కన కమలహాసన్ చేతిలోనూ మైక్ ఉంది .. ఇక ఏమీ చేయలేక కామ్ గా చేతిలో మైక్ పట్టుకున్నాడు . అంతేకాదు రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్నప్పుడు అడిగిన ప్రశ్నలకు సైతం సమాధానం ఇవ్వలేక కొన్నిసార్లు సిగ్గుపడిపోయాడు . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది..!!
Pandagala Digivachavu🥺❤️
#Prabhas #KALKI2898AD pic.twitter.com/XMTABHpmvv— Rᴀᴠɪ ᴠᴀ₹ᴍᴀ™ (@PrabhasVortex) June 20, 2024