అమ్మాయి అయితే మరి అంతలా దిగజారాలా.. చరణ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?!

బాలీవుడ్‌కు సంబందించి ఇప్ప‌టిక‌ప్పుడు ఎవో ఒక విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అక్కడ ఇండ‌స్ట్రీలో నేపాటిజం ఎక్కువగా ఉంటుంది అనే విమర్శలు ఇప్ప‌టినుంచో వ‌స్తున్నాయి. అలాగే అక్కడ జెండ‌ర్ డిస్క్రిమినేష‌న్ పై కూడా చాలా మంది వివ‌రించారు. సినీ సెలబ్రేటీలు కూడా బాలీవుడ్ లో జెండ‌ర్ డిస్క్రిమినేష‌న్ పై రియాక్ట్ అయ్యారు. మేల్ డామినేటెడె ఇండస్ట్రీ అని గతంలో చాలా మంది హీరోయిన్‌లు మీడియా ముందు వెల్ల‌డించారు. పారితోషికం విషయంలోనూ పురుషాదిక్యం ఉంటుందని చాలా మంది హీరోయిన్లు ఫైర్ అయ్యిన సంద‌ర్భాలు ఉన్నాయి. కంగనా రనౌత్, దీపిక పదుకొణే, కరీనా కపూర్, విద్యాబాలన్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో జెండ‌ర్ డిస్క్రిమినేష‌న్ పై కామెంట్స్ చేశారు.

కంగనా రనౌత్ అయితే ఇప్ప‌టికే చాలా సార్లు దీని పై సోష‌ల్ మీడియా వేదిక‌గా పోరాడింది. జెండ‌ర్ డిస్క్రిమినేష‌న్ కారణంగా తాను ఎంతో ఇబ్బంది పడ్డాను అని తెలిపింది. అలాగే తాను చాలా ఆఫర్స్ కూడా కోల్పోయాను అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కంగ‌నా మాదిరిగానే మరో హీరోయిన్ కూడా బాలీవుడ్ లో జెండ‌ర్ డిస్క్రిమినేష‌న్‌పై మాట్లాడింది. ఆమె ఎవరో కాదు చిరుత బ్యూటీ నేహాశర్మ. మెల్ డామినేషన్ గురించి నేహా శర్మ మాట్లాడుతూ.. ఈ జెండ‌ర్ డిస్క్రిమినేష‌న్ కారణంగా నేను చాలా ఇబ్బందిపడుతున్నా అంటూ వివ‌రించింది. తనలానే చాలా మంది అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుందంటూ ఆరోపించింది.

మహిళలు అన్నిరంగాల్లో స‌క్స‌స్ అవుతున్నా వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అవకాశాల కోసం దిగ‌జారాలా..? మహిళా అయితే అంత రాజీ ప‌డాల్సిన పని ఉందా.? హీరోలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడనాకి అంత స్పెష‌ల్ కార‌ణం ఉందా..? అని ప్రశ్నించింది. అలాగే మహిళలు జెండ‌ర్ డిస్క్రిమినేష‌న్ అన్ని రంగాల్లో ఎదుర్కుంటున్నారు. ఇదొక సామాజిక సమస్య అయ్యిపోయింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కాంప్రమైజ్ అనేది ఎక్కువగా వినిబ‌డుతుంద‌ది. వందలో 80 శాతంమంది.. స్త్రీల గురించి ఇలానే ఆలోచిస్తున్నారు. ఇక‌నైనా ఇది మారాలి. స్త్రీ విలువను గుర్తించాలి. బాలీవుడ్ లో జెండ‌ర్ డిస్క్రిమినేష‌న్ నుంచి మహిళలంతా విముక్తి పొందాలి అంటూ కామెంట్స్ చేసింది. నేహా శర్మ చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి.