ఆ పని చేయకపోయిన .. ట్రెండింగ్ లో ఉన్న తెలుగు డైరెక్టర్స్.. లక్కి ఫెలోస్..!

సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా హాట్ హాట్ టాపిక్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. హీరో హీరోయిన్ల ఎఫైర్స్ .. హీరోయిన్ల డైవర్స్.. హీరోల సినిమాల డీటెయిల్స్ లీక్డ్ వీడియోస్.. లవ్ ఎఫైర్స్ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎటువంటి పని చేయకపోయినా కూడా కొంతమంది బాగా పాపులారిటీ సంపాదించుకొని ట్రెండ్ అవుతూనే ఉంటున్నారు . వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా అదే విధంగా వాళ్ళు ఏ విషయంలోనూ సెన్సేషనల్ గా మారకపోయినా .. వాళ్ళ పేరు మాత్రం రోజు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

రాజమౌళి : దర్శక ధీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి .. ప్రెసెంట్ మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. వీళ్ళ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒక్క పిక్ లీక్ అవ్వలేదు .. అసలు పూజా కార్యక్రమాలే జరగలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం హాట్ హాట్ గా ఈ సినిమాకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

సుకుమార్ : పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం చాలా చాలా రేర్ . ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతాడు.. తన సినిమా ప్రమోషన్ టైం వచ్చిందా..? ఆ పని చేసుకుంటాడు .. మిగతా టైం లో కుటుంబ సభ్యులకు పూర్తి సమయాన్ని కేటాయిస్తాడు.. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సుకుమార్ పేరు కూడా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ప్రశాంత్ వర్మ: హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు . నిజానికి ఈయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా తక్కువ టైం అయింది. అయినా సరే రాజమౌళి సుకుమార్ లాంటి బడా పాన్ ఇండియా డైరెక్టర్ తో కంపేర్ చేస్తూ ఆయన రేంజ్ నే మార్చేశారు అభిమానులు. హనుమాన్ సినిమా తర్వాత ఆయన తెరకెక్కించే ప్రాజెక్టు డీటెయిల్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేస్తూనే ఉంటాడు . అయితే చాలా పద్ధతిగా తన పని తాను చూసుకొని వెళ్ళిపోయే ప్రశాంత్ వర్మ కూడా సోషల్ మీడియాలో హర్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు.

బోయపాటి శ్రీను: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. బోయపాటి శ్రీను లాస్ట్ గా తెరకెక్కించిన సినిమా స్కంధ. రామ్ పోతినేని హీరోగా ఈ సినిమా తెరకెక్కింది . శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది . అయితే ఈ సినిమా హ్యూజ్ డిజాస్టర్ అందుకుంది. ఆ టైంలో బోయపాటి శ్రీను ను చాలా ట్రోల్ చేశారు ఆకతాయిలు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు బోయపాటి అయినా సరే ఈయనకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్గా బాలయ్య సినిమాను అనౌన్స్ చేసిన బోయపాటి పేరు కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతూ ఉంటుంది..!!