“డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి రా”..వేణు స్వామీ సెన్సేషనల్ కామెంట్స్..!

పాపం.. వేణు స్వామి ఏమి అనుకున్నాడో తెలియదు కానీ .. ఆయన ఒకటి అనుకున్నాడు దేవుడు మరొకటి తలిచాడు. అంతకుముందు వేణు స్వామి పేరు చెబితే కనీసం 50% జనాలు అయిన పాజిటివ్గా స్పందించే వారు. ఆయన చెప్పిన జాతకాలను నమ్మేవారు . అయితే ఇప్పుడు వేణు స్వామి పేరు చెప్తే ప్రతి ఒక్కరూ యాంగ్రీ గానే ఉంటున్నారు . దానికి కారణం రీసెంట్గా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ . 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఏపీ జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నారు అని అధికారం చేపట్టబోతున్నారు అని బల్ల గుద్ది ధీమా వ్యక్తం చేశాడు వేణు స్వామి .

సీన్ కట్ చేస్తే దారుణాతి దారుణమైన రిజల్ట్ అందుకుంది వైసిపి. దీంతో ఇకపై ప్రిడక్షన్స్ చెప్పను అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు వేణు స్వామి. ఆ తర్వాత ఆయన పని ఆయన చూసుకుంటూ వచ్చాడు .కానీ ఆకతాయిలు మాత్రం ఆయనను వదలడం లేదు . సోషల్ మీడియాలో హ్యూజ్ హ్యూజ్ ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు . నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు.. ప్రతి ఒక్క సారి చెప్పింది చెప్పినట్లు జరుగుతది అని ఎలా నమ్ముతారు.. చాలామంది పెద్దపెద్ద జ్యోతిష్యులు పండితులు చెప్పినవి కూడా కొన్ని కొన్ని సార్లు ప్లాప్ అవుతాయి ..తప్పు జరుగుతాయి ..

నేను చెప్పిన వాటిల్లో 100% కి 90% అన్ని జరిగాయి .. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇది తప్పిస్తే .. మిగతా అన్ని విషయాల్లో నేను చెప్పింది చెప్పినట్లు జరిగింది కదా .. మరి ఎందుకు నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు..? మీరు చేసే ట్రోలింగ్ వల్ల నాకు పూజలు ఎక్కువగా వస్తున్నాయి.. కావాలంటే ఎంక్వయిరీ చేసుకోండి .. కనుక్కోండి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత నాకు ఎక్కువగా పూజలు వస్తున్నాయి ..అస్సలు ఖాళీగా ఉండడం లేదు .. బిజీ బిజీగా మారిపోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి . ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారాయి..!!