ఒక్కే ఒక్క దెబ్బతో త్రిష-నయన్ లకు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్..ఏం చేసిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఎవరు అంటే మాత్రం చరణ్ – ప్రభాస్ – ఎన్టీఆర్ – బన్నీ అని చెప్తూ ఉంటారు . అదే ఫిమేల్ వర్షన్ వచ్చేసరికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరు అంటే మాత్రం సౌత్ ఇండస్ట్రీలో వినిపించేది రెండే రెండు పేర్లు . ఒకటి నయనతార రెండు త్రిష . సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ..ప్రతి సినిమాకి కూడా 10 కోట్లు తక్కువ రెమ్యునరేషన్ అందుకొనే అందుకోదు .

ఈ మధ్యకాలంలో త్రిష కూడా అలానే తయారయింది . ఒక్కొక్క సినిమాకి 6-7 కోట్లు రెమ్యూనేషన్ తీసుకుంటూ వస్తుంది .అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ షాక్ ఇస్తూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది . ఆమె సల్మాన్ ఖాన్ తో నటించే సినిమా కోసం ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 15 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఈ విషయం ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది .

నిన్న మొన్నటి వరకు కేవలం 6 కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేసిన రష్మిక మందన్నా.. సడన్గా ఒక్కసారిగా అంత కు డబుల్ రెమ్యూనరేషన్ ఎందుకు పెంచేసింది..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . ఆశ్చర్యం ఏంటంటే మేకర్స్ కూడా ఆమెకు అడిగినంత రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం హైలైట్ గా మారింది . దీంతో రష్మిక ఇప్పుడు త్రిష నయనతారల రికార్డులను బీడ్ చేసేసింది..!!