రష్మిక బోల్డ్ డెసీషన్.. పాపకి ముందు చూపు ఎక్కువే..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే సరిపోతుందా..? దానికి తగ్గ నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి ..నేను పద్ధతి గల హీరోయిన్ ని.. పద్ధతి గానే ఉంటాను అంటే అసలుకే కుదరదు .. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ .. తన స్థానాన్ని అదేవిధంగా కొనసాగించుకోవాలి అంటే కచ్చితంగా ముందుచూపు అవసరం అప్ గ్రేట్ అవుతూ ఉండాలి .. టెక్నాలజీ ఎలా అప్డేట్ అవుతూ ఉంటుందో హీరోయిన్స్ కూడా పాత్రల విషయంలో అలానే ముందుకు వెళుతూ ఉండాలి ..

అలాంటి విషయాలను రష్మిక మందన్నా కూసింత ఎక్కువగానే ఫాలో అవుతూ ఉంటుంది . రీసెంట్గా రష్మిక తీసుకున్న డెసిషన్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన్నా.. అంటే మల్టీ టాలెంటెడ్ డ్యాన్స్ బాగా చేస్తుంది.. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది.. ఏ పాత్రనైనా సరే బాగా నటిస్తుంది.. ఇంతవరకు అందరికీ తెలిసిందే . అయితే రష్మిక మందన్నా.. సినిమాల కోసం రిస్క్ కూడా చేస్తుంది అన్న విషయం తాజాగా తెలిసింది . రష్మిక మందన్నా.. పుష్ప2 సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

అయితే పుష్ప సినిమా పోస్ట్ పోన్ అయింది . నిజానికి ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాలి కాని డిసెంబర్ 6 పోస్ట్ పోన్ చేశారు . అదే డిసెంబర్ 6వ తేదీ రష్మిక నటిస్తున్న చావ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . దీంతో రష్మిక ఏ సినిమాని ప్రమోట్ చేస్తుందా..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రష్మిక ముందు చూపుతో పుష్ప2 సినిమా ప్రమోషన్స్ కి ఎక్కువ టైం కేటాయించాలి అంటూ డిసైడ్ అయిందట . చావ సినిమా కేవలం బాలీవుడ్ వరకే .. అదే పుష్ప2 హిట్ అయితే మాత్రం పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోతుంది . అందుకే రష్మిక చావా విషయంలో చాలా చాలా లైట్ గా తీసుకుంటుందట. అడపాదడపా ముంబైలో ప్రమోషన్స్ తప్పిస్తే పుష్ప2 సినిమా కోసమే తన కాల్ షీట్స్ మొత్తం కేటాయిస్తుందట… దీంతో కన్నడ పిల్లకి ముందుచూపు ఎక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!