ప్రస్తుతం త్రో బ్యాక్ థీంతో సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో క్లాస్మేట్స్ అందరూ యూనిఫాంలో కనిపిస్తుంటే స్పెషల్ గా కలర్ డ్రెస్ లో ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్న ఈ కుర్రాడి తాజా ఫోటో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ కుర్రాడు టాలీవుడ్ క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. ముకుసూటిగా మాట్లాడే మనస్తత్వం కావడంతో పలు కాంట్రవర్సీలోనే చిక్కుకుంటూ ఉంటాడు. అతడు ఎంచుకునే సబ్జెక్టు కూడా అలానే ఉంటుంది. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరో గెస్ చేసారా.. అతను మరెవరో కాదు టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ విశ్వక్ సేన్. 2009లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బంగారు బాబు సినిమాలో నటించాడు. 2017 లో వెళ్ళిపోమాకే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే విశ్వక్‌కు మంచి సక్సెస్ అందించి.. మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా మాత్రం ఈ నగరానికి ఏమైంది.
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఎంటర్టైనర్ తో విశ్వక్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఫలక్‌నామా దాస్‌తో.. మాస్ ఆడియన్స్ అభిమానాన్ని దక్కించుకున్నాడు. ఇక డైరెక్టర్ శైలేష్ కొలన్ హిట్ టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో విశ్వక్ సేన్ పోలీస్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో పాత్ర చాలా ఇంటెన్సుడ్‌గా తెరకెక్కింది. హీరో నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. అనంతరం విశ్వక్ హీరోగా నటించిన పాగల్, దాస్ కా ధంకి, అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా సినిమాలు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందకోలేకపోయినా ఈ ఏడాది రిలీజ్ అయిన గామితో హిట్ టాక్ దక్కించుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు విశ్వక్.
ఇక ఈ మూవీలో విశ్వక్ అఘోర పాత్రలో కనిపించాడు. అరుదైన వ్యాధితో బాధపడే అఘోర చేసే సాహస ప్రయాణమే ఈ సినిమా. విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా విశ్వక్ హీరోగా బచ్చిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నెగటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో విశ్వక్ ఇందులో నటించాడు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్‌లుగా తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగా యావరేజ్ అనిపించుకున్నా.. మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. ఇక సినిమా సినిమాకు తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్న విశ్వక్ టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నాడు.