మాజీ భర్త చనిపోయిన స్పందించిన శ్రీజ ..రివేంజ్ అలా తీర్చుకుందా..?

శ్రీజ కొణిదల .. సోషల్ మీడియాలో ఒక పాన్ ఇండియా హీరోయిన్ కి మించిన రేంజ్ లో ట్రోలింగ్కి గురయ్యే పేరు . శ్రీజ మెగా డాటర్.. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు .. మెగాస్టార్ చిరంజీవికి శ్రీజ అంటే ఎంత ఇష్టం అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి .. శ్రీజను బాగా గారాభంగా పెంచారు.

చాలామంది అదే ఆయన చేసిన తప్పు అంటూ కూడా నిందిస్తూ ఉంటారు. శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుంది .. రెండుసార్లు విడాకులు ఇచ్చేసింది . అయితే శ్రీజ మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణించారు. లంగ్స్ ప్రాబ్లం కారణంగా ఆయన చికిత్స తీసుకుంటూ మరణించారు . ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ పోస్ట్లు పెట్టారు. కానీ ఎక్కడా కూడా శ్రీజ తన మాజీ భర్తకు సంబంధించిన పోస్ట్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో మరొకసారి ఆమెను ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు .

అయితే శ్రీజ తో శిరీష్ భరద్వాజ్ విడిపోయిన తర్వాత ఆయన తన కూతుర్ని కూడా అసలు పట్టించుకోలేదు అని .. ఆ కోపంతోనే శ్రీజ ఇప్పుడు ఈ విధంగా ఏమి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది అంటున్నారు మెగా ఫ్యాన్స్ . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే కొందరు ఈ విషయంలో శ్రీజ తీసుకున్న నిర్ణయం తప్పు అంటున్నారు.. మరి కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు..!!