ఆ ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలకు ఈగో ఎక్కువ.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్..?!

తెలుగు సినీ ఇండస్ట్రీపై, టాలీవుడ్ స్టార్ హీరోలపై.. బాలీవుడ్ ఎప్పటికప్పుడు విషం కక్కుతూనే ఉంటుంది. బాలీవుడ్ ఉండే స్టార్ హీరోలు.. టాలీవుడ్ హీరోలను తొక్కేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. దీంతో ఎప్పటికప్పుడు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అక్కడ మీడియా కానీ, హీరోలు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ, టాలీవుడ్ విమర్శించేందుకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలాగైనా సరే తొక్కేయాలని ఎంతమంది ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వారు టాలీవుడ్ ను టచ్ కూడా చేయలేకపోతున్నారు. ఇక మన హీరోలు ప్రతి సినిమాతో అక్కడ కూడా ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు.

కనుక బాలీవుడ్ దాన్ని జీర్ణించుకోలేక పోతుంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయినా వీరేందర్ చావ్లా టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోల పైన కూడా షాకింగ్ కామెంట్స్ చేస్తూ విమర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ వీరేంద్ర చావ్లా మాట్లాడుతూ టాలీవుడ్ హీరోస్ పైకి బిల్డప్ ఇస్తూ లోపల మాత్రం ఈగో పెట్టుకుని మాట్లాడతారని.. వాళ్లు చాలా మంచి వాళ్ళుగా కనిపిస్తారు కానీ.. ఈగో ఎక్కువ అంటూ విమర్శించాడు. అలాగే విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఈవెంట్‌కు చెప్పులు వేసుకుని వచ్చాడని.. ఆయన చాలా సింపుల్ గా ఉంటాడని.. సింప్లిసిటీ పర్సన్ అంటూ ప్రశంసలు కురిపించారు. కానీ జనాల మధ్య అలా నటిస్తున్నాడు. పర్సనల్గా వేరే రకంగా ఉంటాడు అంటూ విమర్శించాడు.

Paparazzo calls South stars 'fake'; takes dig at Vijay Deverakonda, Mahesh  Babu: 'Woh log naklipan karte hai' | Bollywood News - The Indian Express

అలాగే ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ ఒక పబ్లిక్ పార్టీకి వచ్చినప్పుడు తనతోటి ఫోటోగ్రాఫర్‌ను ఎన్టీఆర్ ఫోటో తీసినందుకు అతని మీద ఫైర్ అయ్యాడని.. పైకి జనాల్లో మాత్రమే నటిస్తాడు. లోపల మాత్రం చాలా ఈగోతో ఉంటాడు అంటూ వివరించాడు. అలాగే మహేష్ బాబు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీతో తనకు సంబంధం లేదని తెగేసి చెప్పారని.. అతను చాలా ఆటిట్యూడ్ పర్సన్ అంటూ విమర్శించాడు. అలాగే బాలీవుడ్ హీరోలు పైకి ఒకలా.. లోపల మ‌రోలా ఉండరు. వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారంటూ ప్రశంసించాడు. తెలుగు హీరోలు మాత్రమే లోపల ఒకటి పెట్టుకుని పైకి నటిస్తారని.. ఫోటోగ్రాఫర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీరేందర్ పై ఫైర్ అవుతూ టాలీవుడ్ అభిమానులు బండ బూతులు తిడుతున్నారు.