ఈ క్యూట్ పాపా.. ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న చిన్న పాప ఓ టాలీవుడ్ స్టార్ హీరో కూతురు. తల్లి కూడా హీరోయిన్. ఇప్పుడు మీ అమ్మడు కూడా హీరోయిన్ గా రాణిస్తుంది. అందరిలా కాకుండా సెలెక్టివ్‌గా సినిమాలను నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటుంది. ఇండస్ట్రీలో పురుషాధిపత్యం ఎక్కువగా ఉంటుందనే మాట ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుంటారు. కానీ హీరోయిన్లుగా కూతుళ్లు చాలా తక్కువగా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు.

Dorasani movie review: A realistic love story | Dorasani movie review: A  realistic love story

ఈ కోవాకు చెందుతుంది పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ. చేసింది తక్కువ సినిమాలో అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు స్కిన్ షో కి దూరంగా ఉంటూ కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటుంది. తన పాత్ర‌కు ప్రాధాన్యత ఉందనిపిస్తేనే నటిస్తుంది. ఇక‌ ఈ చిన్ని పాప ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక. దొరసాని మూవీ హీరోయిన్. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వెంటనే తల్లిదండ్రులను అనుసరిస్తూ.. సినిమాల్లోకి అడుగుపెడదాం అనుకున్న శివాత్మిక హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Shivathmika Rajashekar (@shivathmikar) • Instagram photos and videos

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసానితో టాలీవుడ్ ప్రేక్షకులు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో త‌న నటనకు గాను సైమా పురస్కారం దక్కించుకుంది. తర్వాత పంచతంత్రం, రంగమాతాండ సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకొని నటించింది. తమిళ్లో రెండు సినిమాల్లో ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ఎటువంటి సినిమాలను నటించడం లేదు. ఆయినా ఇప్పటికీ అదే క్రేజ్‌.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేసుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.