నెక్స్ట్ ఇండస్ట్రీలో ఆ పని చేయబోతున్న స్టార్స్ వీళ్లే.. ఏ ప్లానింగ్ రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది పెద్ద కొత్త మ్యాటర్ కాదు .. ఎప్పటినుంచో తరతరాలుగా వస్తున్న తంతే ఇది .. తాత పోతే తండ్రి..తండ్రి పోతే కొడుకు.. కొడుకు పోతే మనవడు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇండస్ట్రీలో బాగా పాగా వేసుకుంటూ రాజ్యమేలేస్తున్నారు. అది ఒక్క ఇండస్ట్రీ అని చెప్పలేం ప్రతి భాషలోనూ ఇదే ప్రాసెస్ కొనసాగుతూ వస్తుంది . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఇప్పటివరకు స్టార్ హీరోస్ అంటే పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – ప్రభాస్ – అల్లు అర్జున్ – తారక్ – చరణ్ ఇలా చెప్పుకునే వాళ్ళు. అయితే నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన స్టార్స్ ను రంగంలోకి దించడానికి టాలీవుడ్ స్టార్స్ ఫిక్సయినట్లు తెలుస్తుంది . త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ..అదేవిధంగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ ..బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే వీళ్ళు ఏ డైరెక్టర్ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారా ..? అనేది మాత్రం ఫ్యాన్స్ కు పెద్ద అయోమయంగా మారింది. అంతేకాదు ఈ ముగ్గురు స్టార్స్ పిల్లలు తమ తండ్రి పేర్లను మించిపోయే రేంజ్ లో క్రేజ్ ను అందుకుంటారా..? లేదా అన్నది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది . అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అకిరానందన్ విషయంలో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఆ హైట్ కే ఫిదా అయిపోతున్నారు ..పవర్ స్టార్ లోని పవర్ ను కచ్చితంగా అఖీరా చూపించబోతున్నాడు అని ఇండస్ట్రీలో నెక్స్ట్ పవర్ స్టార్ అఖీరానందన్ అంటూ తెగ పొగిడేస్తున్నారు పవన్ అభిమానులు..!!