ఈ మధ్యకాలంలో ఎలా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ డివర్స్ తీసుకుంటున్నారు మనం చూస్తున్నాం. ప్రతి చిన్న విషయానికి అలగడం ..పోట్లాడడం.. మనస్పర్ధలు రావడం.. అప్పటికే విసుకు చెందిపోయిన వాళ్ళు ఓపిక లేక విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ పెరిగిపోవడానికి కారణం అవుతుంది. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఏ ఇలా విడాకులు తీసుకుంటూ ఉండడం గమనార్హం .
ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రెటీస్ విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా మరొక స్టార్ క్రేజీ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ జంట పెళ్లి చేసుకుని రెండేళ్లు అవుతుంది.. ఒక బిడ్డ కూడా ఉంది . అయితే ఈ జంట మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారట.
దీనికి కారణం ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోయిన్ అంటూ తెలుస్తుంది . రీసెంట్ గానే ఆమెతో ఒక మంచి రొమాంటిక్ సినిమాలో నటించిన హీరో ..భార్యను వదిలేసి ఆ హీరోయిన్ పై మోజు పడ్డాడట. దీంతో గోల్డెన్ స్పూన్ తో పెరిగిన ఆ బ్యూటీ ఈగో హర్ట్ అయి అతగాడికి దూరంగా ఉంటుందట. అంతేకాదు వీళ్ళిద్దరూ విడిపోబోతున్నారు అంటూ కూడా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం అలా జరగకూడదు దేవుడా అంటూ ప్రార్థిస్తున్నారు..!!