బాలయ్య అభిమానా మజాకానా.. పుట్టిన రోజు నాడు ఏం చేశాడో తెలుసా..?

బాలయ్య అభిమానులు చాలా చాలా డిఫరెంట్ ..నమ్మితే ప్రాణం ఇస్తారు.. నమ్మించి మోసం చేస్తే తాట తీసేస్తారు ..అంతా బాలయ్య లాగానే.. ఏదైనా మంచి పని చేస్తే బాలయ్య ఎంతలా ఎంకరేజ్ చేస్తాడో.. అంత తప్పుడు పని చేస్తే అక్కడే తాట తీసేస్తాడు.. ఆ విషయం అందరికీ తెలిసిందే . అలాంటి సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం. నిన్న బాలయ్య తన 64వ పుట్టినరోజు ను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు . మరీ ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి విజయముందుకొని హ్యాట్రిక్ నమోదు చేసుకున్న బాలయ్య ఓ రేంజ్ లో తన బర్త్డ డేని ఎంజాయ్ చేశారు .

అయితే బాలయ్య బర్త్డ డేను ఆయనే కాదు వాళ్ళ ఫాన్స్ కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేశారు ..కొందరు కేక్ కట్ చేసి జై బాలయ్య అంటూ అరుపులతో ఎంజాయ్ చేస్తే .. మరికొందరు ఫుడ్ పంపిణీ చేసి బాలయ్య పేరు చెప్పి ఆయన ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటూ కోరుకున్నారు . అయితే ఇక్కడ ఒక అభిమాని ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టి ఐదు కేజీల కర్పూరాన్ని తిరుమల లో వెలిగించడం సంచలనంగా మారింది .

ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఎన్టీఆర్ రాజు గారి కొడుకు రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ బాలకృష్ణకు వీరాభిమాని. శ్రీధర్ వర్మ నేడు తిరుమల ఫ్యామిలీతో సందర్శించి అనంతరం ఆలయం ముందు అఖిలాండం వద్ద బాలకృష్ణ 64వ పుట్టిన రోజు సందర్బంగా 664 కొబ్బరికాయలు కొట్టి, 5 కిలోల కర్పూరం వెలిగించి బాలయ్య పేరిట పూజలు నిర్వహించారు.బాలయ్య తన 64వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న మూమెంట్లో 664 కొబ్బరికాయలు స్వయంగా ఆయనే కొట్టి ఆ తర్వాత అఖండ జ్యోతి వద్ద ఐదు కేజీల కర్పూరాన్ని వెలిగించి బాలయ్య ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి అని సంతోషంగా ఉండాలి అని కోరుకున్నారు . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.