విజయ్ దేవరకొండ తలరాతను మార్చేసిన ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుందా..? ఫ్యాన్స్ కి పండగే..!!

ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోయింది . కొత్త కథలు దొరకడం లేదో.. లేకపోతే జనాలకు కొత్త కథలు నచ్చడం లేదో.. రీజన్ ఏంటో తెలియదు కానీ డైరెక్టర్ లు ఒకప్పుడు తాము తెరకెక్కించిన సినిమాలకు పార్ట్ 2 పెరిటా సీక్వెల్ పేరిట రీ రిలీజ్ పేరిట మళ్ళీ ఆ సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నారు . ఇప్పటికే అలాంటి సినిమాలను మనం బోలెడు చూసాం . అయితే తాజాగా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన గీతాగోవిందం సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

పరుశురాంపేట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన సినిమా గీతా గోవిందం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. పరశురాంపేట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించాడు . ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది. అయితే ఎలాగైనా సరే మళ్లీ వీళ్ళ కాంబోలో క్రేజీ హిట్ పడాలి అని గీతగోవిందం 2 తేర్ పైకి తీసుకొస్తున్నారట .

ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నే పెడితేనే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మరి రష్మిక మందన్నా కూడా ఈ ప్రాజెక్టులో నటించడానికి ఓకే చెప్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుందట. చూద్దాం మరి ఈ సినిమా వీళ్లకి ఎలాంటి హిట్ ఇస్తుందో..??