టాలీవుడ్ బ్యూటీ చాందిని చౌదరి కలర్ ఫోటో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే సినిమాలోని అమ్మడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో వరుసగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. త్వరలో బాలకృష్ణ సినిమాలో కూడా చాందిని మరువనుంది. డైరెక్టర్ బాబి తెరకెక్కిస్తున్న బాలకృష్ణ ఎన్బికె 109 సినిమాలో చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
కాగా నిన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ టైంలో బాలయ్యతో దిగిన స్పెషల్ ఫోటోను షేర్ చేసిన చాందిని చౌదరి.. బాలకృష్ణకు విషెస్ తెలియజేసింది. అలాగే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరి మాట్లాడుతూ ఎన్‌బీకే 109 సినిమా గురించి.. బాలయ్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఆల్మోస్ట్ 50% పూర్తయిందని.. ఇందులో నేను స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. సినిమాలో ఫుల్ లెన్త్ నా పాత్ర ఉంటుందని.. స్టార్ హీరో సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించబోతున్న అంటూ వివరించింది.
కథలో నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. సెట్లో బాలయ్య చాలా సరదాగా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. సెట్ లో మేమిద్దరం కలిసి అందరిపై ఫ్రాంక్ చేసేవాళ్లం అని ఆమె వివరించింది. షాట్స్ ఉన్నా లేకపోయినా బాలయ్య గారు సెట్ లోనే ఉండేవారు.. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరితో ఈజీగా కలిసిపోయేవారు. ఫ్రెండ్లీగా ఉండేవారు అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారాయి.