‘ కల్కి ‘ లో రౌడీ హీరో.. కనిపించేది ఆ పాత్రలోనేనా.. రెమ్యునరేషన్ ఎంతంటే..?!

ప్రస్తుతం అంద‌రి దృష్టి కల్కి పైనే ఉన్న సంగతి తెలిసింది. ఒక తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా మోస్ట్ అవైటెడ్ గా ఎదురుచూస్తున్న మూవీ కల్కి. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లో చూస్తామా అంటూ కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఊహకందని అంచనాలు నెలకొన్నాయి.

Vijay Devarakonda Acts in Prabhas s Project K.?

పురాణాలకు.. ఆధునికతను జోడించి సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు అశ్విన్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తుందంటూ ట్రేడ్ వర్గాలు కూడా ముందు నుంచి అంచనాలు వేస్తున్నాయి. ఇప్పటికే సినిమానుంచి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు సినిమాపై వేరే లెవెల్లో అంచనాలను ఏర్పరిచాయి. ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ట్రైలర్ పై ఇప్పటికే రాజమౌళి, సందీప్ రెడ్డి వంగలాంటి స్టార్ డైరెక్టర్లు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ ట్రైలర్ కు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. కల్కిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అశ్వద్ధామను ఎదుర్కొనే పాత్రలో విజయ్ ఉండబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న క్ర‌మంలో మూవీ యూనిట్ దీనిపై క్లారిటీ ఇస్తారా లేదా సస్పెన్షన్ కొనసాగిస్తారనేది వేసి చూడాలి. అయితే విజయ్ దేవరకొండ ఈ పాత్ర కోసం రూ.50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది.