‘ తండేల్ ‘ విషయంలో అక్కినేని హీరోకి ఎదురవుతున్న చిక్కు ముడ్లు.. చైతుకి ఇబ్బందులు తప్పవా..?!

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లను ఎదుర్కొంటున్న అక్కినేని నాగచైతన్య మార్కెట్ బాగా పడిపోయిన సంగతి తెలిసిందే. చివ‌రిగా వ‌చ్చిన‌ కస్టడీ సినిమాతో కూడా హిట్ అందుకోలేకపోవడంతో నాగచైతన్య మ‌రింత డీలా ప‌డిపోయారు. ఈ క్ర‌మంలో ప్రస్తుతం తను నటిస్తున్న తండేల్‌ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. గతంలో నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్, సవ్యసాచి లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన చందు మండేటి డైరెక్షన్‌లో ఈ సినిమాను నటిస్తున్నాడు. లవ్ స్టోరీ సినిమాలో చైతు సరసన నటించి హిట్ అందుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుంది.

Thandel: Makers release first-look of Chaitanya, Sai Pallavi's patriotic  drama - Hindustan Times

గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని కసితో ప్రయత్నిస్తున్నాడు నాగచైతన్య. ఈ క్రమంలో అభిమానులు కూడా ఈ సినిమాతో ఎలాగైనా చైతు హిట్ అందుకుంటాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల విశాఖపట్నంలో కంప్లీట్ చేసుకుని.. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే నాగచైతన్య చెన్నైకి వెళ్ళాడు. కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నాక మరో రెండు షూటింగ్ స్కడ్యూల్‌లో హైదరాబాద్, ఢిల్లీలో పాల్గొని బిజీగా గడపనున్నాడు చైతు. ఒకటి, రెండు పాటలతో పాటు.. ఫైటింగ్ షాట్స్‌ కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తుంది.

Pushpa 2: The Rule To Game Changer: List Of Highly Anticipated Telugu  Movies Of 2024 - News18

ఇక సినిమాకు సంగీత దర్శకుడుగా దేవి శ్రీ‌ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికీ ట్యూన్ కూడా అందించేసినట్లు సమాచారం. సినిమాకి సంబంధించిన పనులన్నీ ఆల్మోస్ట్ పూర్తయిపోయాయి.. కానీ అసలు సమస్య రిలీజ్ తేదీ తోనే వచ్చి పడినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 20న సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. కానీ డిసెంబర్ మొదటి వారం బన్నీ పుష్ప 2 రిలీజ్ కావడంతో తండేల్ బృందానికి షాక్ తగిలినట్లు అయింది. ఇది చాలాదన్నట్లు ఇప్పుడు రామ్ చరణ్ గేమ్‌ చేంజర్‌ సినిమా కూడా డిసెంబర్ 24 విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తండేల్‌ టీం సినిమాని ముందుకు వెనక్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌ద్యంలో కొద్ది రోజుల్లో సినిమా విడుదలకు సంబంధించిన క్లారిటీ మేకర్స్ ఇవ్వనున్నారని టాక్.