అప్పుడు కొడుకుతో – ఇప్పుడు తండ్రితో..మరో బిగ్ బంపర్ ఆఫర్ కొట్టేసిన కాజల్ అగర్వాల్..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. ఇది జరుగుతుంది అని పక్కాగా చెప్పలేం. ఒకప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రి ని ఏలేసిన ముద్దుగుమ్మలు ఆ తర్వాత ఫెయిడౌట్ అవుతూ ఉంటారు. కొంతమంది ఫస్ట్ ఇన్నింగ్స్ లోను సెకండ్ ఇన్నింగ్స్ లోను దుమ్ము దులిపేస్తూ ఉంటారు . అదే లిస్టులోకి వస్తుంది కాజల్ అగర్వాల్ . లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ..ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలా టాలీవుడ్ కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందో మనకు తెలిసిందే.

కాగా సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో ముందుకెళ్తుంది కాజల్ అగర్వాల్. రీసెంట్గా సత్యభామ సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు ఒక స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన మరెవరో కాదు నాగార్జున . ఎస్ అక్కినేని నాగార్జున 100వ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది.

కాజల్ అగర్వాల్ – నాగార్జున కొడుకు నాగచైతన్యతో దడ అనే సినిమాలో నటించింది . ఇప్పుడు నాగార్జునతో100వ సినిమాలో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఒక్కసారిగా కాజల్ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ బడా బడా ఆఫర్స్ అందుకుంటున్న కాజల్ సినిమాకి 2 కోట్లు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం..!!