‘ కల్కి ‘ ట్రైలర్ పై సందీప్ రెడ్డి వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్క మాటతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసాడే..?!

ప్రభాస్ నటించిన క‌ల్కి కోసం ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కల్కి 2898ఏడి కొత్త ట్రైలర్ శుక్రవారం రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ట్రైల‌ర్ ఈ విశ్వం అంతా భగవంతుని లోపల ఉంటుందని వారు చెప్పారు. కానీ దేవుడు నీ గర్భంలో ఉన్నాడు అంటూ అశ్వద్ధామ పాత్రలో అమితాబచ్చన్.. దీపికకు చెప్పిన డైలాగ్ తో ప్రారంభమైంది. ఇది చూసిన వెంటనే పాన్ ఇండియ‌న్‌ స్టార్ డైరెక్ట‌ర్‌ సందీప్ రెడ్డివంగా ట్రైలర్ గురించి ఆసక్తికర పోస్ట్ చేశాడు.

Filmfare on X: "Here's how #SandeepReddyVanga reacted to the trailer of  #Kalki2898AD starring #AmitabhBachchan, #KamalHaasan, #DeepikaPadukone and  #Prabhas. https://t.co/Z4B59jRWjH" / X

సోషల్ మీడియా వేదికగా ఎక్స్ పేజ్ పై సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ.. తాజాగా వచ్చిన కల్కి సెకండ్ ట్రైలర్‌ను ఏకంగా మూడుసార్లు చూశానని వివ‌రించాడు. ఇది ఓ అద్భుతమైన ట్రైలర్.. చాలా కొత్త అనుభవం క‌లిగించింది. మొదటి రోజు సినిమా చూడడం గ్యారెంటీ అంటూ ట్విట్ చేశాడు. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హిందూ గ్రంధాల నుంచి ప్రేరణ పొందిన క‌థ‌. మైథలాజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులోను భారీ లెవెల్లో అంచనాలు ఉన్నాయి.

Sandeep Reddy Vanga, SS Rajamouli Laud Nag Ashwin For Kalki 2898 AD  Trailer: 'First Day First Show Pakka' - News18

ఎప్పుడెప్పుడు సినిమా ధియేటర్లకు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ అంతా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాపై ఆసక్తిని చూపుతూ.. మొదటి రోజు ఫస్ట్ షో చూడడం పక్క అంటూ చేసిన కామెంట్స్ నెటింట‌ మరింత వైరల్ గా మారాయి. ఈ క్ర‌మంలో సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ తో సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి.