రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏ పాత్రలో అంటే..?!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తుది ద‌శ‌కు చేరుకున్నా సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటికి అనౌన్స్ చేయలేదు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్, బుచ్చిబాబు సన్నాతో మరో సినిమాకు గురించిన సంగతి తెలిసిందే. షూట్ పూర్తి అయిన వెంటనే బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అని సమాచారం. దీని ప్రకారం బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వచ్చే సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Ram Charan's RC 16: Director Buchi Babu Sana drops major update; says film  will be sure shot blockbuster | PINKVILLA

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్ గా మారింది. ఆర్‌సి16 రన్నింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్.. ఓ పవర్ఫుల్ కీ రోల్లో కనిపింయ‌నుందని తెలుస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలో ఆ అమ్మ‌డు మరువనుందట. ఇంత‌కి ఆమె మరెవరో కాదు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న రమ్యకృష్ణ. నీలాంబరితో నరసింహ సినిమాలో నటించి రజనీకాంత్‌తో త‌ల‌ప‌డిన‌ ఈ అమ్మడు.. సెకండ్ ఇన్నింగ్స్ లోను వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తుంది.

Ramya Krishna Hot Images: Actress Ramya Krishna looks stunning in latest  Saree Pictures | Ramya Krishna Pics: లేటు వయసులో ఘాటు అందాలు.. శారీలో  రమ్యకృష్ణ గ్లామర్ ట్రీట్ పోలా అదిరిపోలా ...

బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో మెప్పించిన ఈమె.. తెలుగుతో పాటు సౌత్ ఇండ‌స్ట్రీలోను పలుభాషలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇక మొత్తానికి రమ్యకృష్ణ నటించిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో కూడా ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండనుందని.. దీంతో అలాంటి పాత్రకు కేవలం రమ్యకృష్ణ అయితేనే బాగా సెట్ అవుతుందనే ఉద్దేశంతో బుచ్చిబాబు ఆమెను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుచ్చి బాబు, చరణ్ కాంబో మూవీలో స్టార్ కాస్టింగ్ అంతకంతకు పెరుగుతుంది.