ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ కల్కి ‘ తెలంగాణ, ఏపీలో స్పెషల్ షోస్ కు అనుమతి.. టికెట్ల రేట్లు ఎంత అంటే..?!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి పై అందరి దృష్టి ఉందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహానటి ఫేమ్‌ నాగ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టికెట్లు రేట్లు ఎలా ఉండనున్నాయి.. స్పెషల్ షోకు ఏర్పాట్లు జరిగాయా.. లేదా.. అనే అంశం నిన్నటి వరకు సస్పెన్స్ గా సాగింది. తాజాగా ఈ సస్పెన్స్ కు మేకర్స్ తెరదించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణ టికెట్ల ధరల విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ లో రూ. 100 మల్టీప్లెక్స్ లో రూ.75 వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం. దీన్ని బట్టి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265 మల్టీప్లెక్స్ లో రూ.413 కల్కి టికెట్ రేటు ఉండనుంది. ఈ ధరలతో పాటు ట్యాక్స్‌లు అదనంగా వసూలు చేయనున్నారు. టికెట్ ధరలతో పాటు కల్కి 2898 ఏడి స్పెషల్ షో గా.. ఆరో షో ను ఉదయం 5:30 గంటలకు, అలాగే బెనిఫిట్ షో ను కూడా స్క్రీనింగ్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇక బెనిఫిట్ షో టికెట్ ధరలు జీవోలో వెల్లడించిన విధంగా సింగల్ స్క్రీన్ లో రూ.377 మల్టీప్లెక్స్ లో రూ.495 ఉండ‌ నుంది. ఫస్ట్ వీక్ మొత్తం పెరిగిన ధరలతో కల్కి సినిమా స్క్రీనింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

జూన్ 27 నుంచి జూలై 4 వరకు టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. ఏపీ టికెట్ల ధర పెంచుకునే విషయంలోనూ టిడిపి, జనసేన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సింగల్ స్క్రీన్ తో పాటు మల్టీప్లెక్స్ లో రూ.100 వరకు టికెట్ ధరను పెంచుకునే అనుమతి ఇచ్చారు. ఏపీలో టికెట్ రేట్లు పెంపుకు సంబంధించిన జీవో సోమవారం జారీ కానున్నట్లు టాక్. ఏపీ టికెట్ రేట్లకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన వెంటనే కల్కి 2898 ఏడి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏపీ, తెలంగాణలో కలిపి అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో రిలీజ్‌కు వారం ముందే కల్కి అడ్వాన్స్ బుక్కింగ్స్ ముగించి రెండు మిలియన్లు దాటేసి రికార్డులు సృష్టించనున్న‌ సంగతి తెలిసిందే. అతి తక్కువ టైంలో ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన ఇండియన్ మూవీ గా కల్కి రికార్డ్ సృష్టించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ క్షణాల్లో యూట్యూబ్‌లో విధ్వంశం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సెకండ్ ట్రైలర్ 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకొని సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో బ్లాస్ట్ చేస్తుందో చూడాలి.