“కల్కి 2898 AD” సినిమాకి అతి పెద్ద మైనస్ అతడే ..తేల్చేసిన ప్రభాస్ ఫ్యాన్స్..!

ఎస్ ప్రజెంట్ కల్కి సినిమా చూసిన రెబల్ ఫ్యాన్స్ ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్వీన్ కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అని.. ఓపెన్ గా ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉండడం గమనార్హం . ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ – అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో అదేవిధంగా దిశాపటాని – దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898 ఏడి .

ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ అయి హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . అయితే ఈ సినిమాలో చాలామంది హీరోలను హీరోయిన్లను గెస్ట్ పాత్రల్లో చూపించాడు నాగ్ అశ్వీన్. ఇదే క్రమంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను అర్జునుడి పాత్రలో చూపించారు. ఇది నిజంగా రౌడీ హీరో ఫ్యాన్స్ కి సూపర్ సర్ప్రైజింగ్ అని చెప్పాలి . అప్పటివరకు టు నాటీ రోల్స్ చేసిన విజయ్ దేవరకొండను సడన్గా అర్జునుడు గెటప్ లో చూడగానే ఒక్కసారిగా ఎవరి కళ్ళను వాళ్ళు నమ్మలేకపోయారు.

అంతేకాదు కొందరు విజయ్ దేవరకొండ డేర్ కు హాట్సాఫ్ చెబుతుంటే .. మరికొందరు సినిమాకి ఆయన పాత్ర పెద్దగా కలిసి రాలేదు అని .. ఆయన లుక్స్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు అని .. డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా ఏదో జలుబు చేసి జ్వరం మీద డైలాగ్స్ చెప్తున్నట్లు వణుకు వణుకుతూ చెప్పాడు అని ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు..!!