జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ చూశారా.. ఎంత అద్భుతంగా చేశాడో.. రేర్ వీడియో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ష‌న్‌లో దేవర సినిమాలో నటిస్తున్న తారక్.. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో వార్2 సినిమాలోను నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్.. మొదటి నుంచి ఏకసంతాన గ్రహి అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీ వ్యక్తులు కూడా ఎన్టీఆర్ గురించి ఇదే విషయాన్ని వెల్లడించారు.

Jr NTR Fantastic Classical Dance Performance | UNSEEN | Manastars

ఏ విషయమైనా ఇట్టే పట్టేస్తారని.. డైలాగ్, డ్యాన్స్ ఇలా ఏదైనా ప్రాక్టీస్ లేకుండానే సెట్లో ఫస్ట్ టేక్‌తోనే ఓకే చేసే రేంజ్ లో ఎన్టీఆర్ నటన ఉంటుందని.. ఆయనతోపాటు కలిసి పనిచేసిన ఎంతోమంది సినీ ప్రముఖులు వివరించారు. యాక్టర్ గా, డ్యాన్సర్ గానే కాకుండా సింగర్‌గాను తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి తారక్ చిన్ననాటి నుంచే ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో సక్సెస్ లను సాధించాడు. దేశంలోనే గొప్ప డ్యాన్సర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్.. చిన్నప్పుడు భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసిక్ డ్యాన్స్‌లో ప్రాముఖ్యత పొందిన సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చాడు తారక్.

శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం పొంది.. తిరుగులేని డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. మెరుపు వేగంతో ఎంత కఠినమైన స్టెప్స్ అయినా ఇట్టే చేసి ఆడియన్స్ మెప్పిస్తాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ విషయంలో ఇప్పటికి ఆయనతో పనిచేసిన పలువురు కొరియోగ్రాఫర్ ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ చిన్ననాటి క్లాసికల్ డ్యాన్స్ వీడియో ఒకటి నెటింట‌ వైరల్ గా మారింది. దీంతో అభిమానులంతా ఆ వీడియోని చూసి తెగ మురిసిపోతున్నారు. చిన్న వయసులోనే మా తారక్ అన్న ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశాడు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తారక్ డాన్స్ కు ఫిదా అవుతున్నారు.