యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న‌ శర్వనంద్ ‘ మనమే ‘ ట్రైలర్.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి కాంబినేషన్లో తెర‌కెక్కనున్న‌ మూవీ మనమే. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 7 , 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కృతి శెట్టికి సరైన హిట్ ప‌డి సంవత్సరం దాటుతుంది. ఈ క్రమంలో మనమే సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తోంది ఈ అమ్మడు. ఇక కొద్ది రోజుల క్రితం మనమే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం సాంగ్స్, టీజర్స్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Manamey trailer: Sharwanand, Krithi Shetty struggle with parental duties.  Watch - Hindustan Times

తాజాగా సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఈ మూవీ ట్రైలర్ చూస్తే సినిమా కథ మొత్తం ఒక చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక సినిమా ట్రైలర్ రిలీజ్ నెట్టింట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూసిన ఆడియన్స్ అంతా ఈ సినిమాతో కృతి శెట్టి కచ్చితంగా హిట్ కొడుతుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ట్రైల‌ర్‌ యూట్యూబ్‌లో దుమ్ము రేపుతుంది. 2.5 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో ఉన్న విషయాన్ని మేకర్స్‌ స్వయంగా ప్రకటిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ డిఫరెంట్ కధాంశంతో తెరకెక్కనుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. ఇక తాజాగా జరిగిన ట్రైలర్ ఈవెంట్లో శర్వానంద్ చేసిన కామెంట్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేశాయి. శతమానం భవతి లాంటి మంచి కంటెంట్ ఉన్న కథ‌. అదే రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ చెప్పడంతో సినిమా ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.