పెళ్లికి ముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న లవ్ బర్డ్స్.. ఇటలీలో హీరో, హీరోయిన్ ఫొటోస్ వైరల్..?!

హీరో, హీరోయిన్‌లు సిద్ధార్థ, అధితి రావ్ హైదారి ఇదంద‌రు గ‌త‌ కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్ లో ఉంటూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్త‌లు వినిపించిన‌ సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట ప్రైవేట్ గా నిశ్చితార్థం చేసుకొని ఫాన్స్ కు షాక్‌ ఇచ్చారు. అయితే పెళ్లికి ముందే ఈ లవ్ బర్డ్స్ స‌మ్మ‌ర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇటలీ వెళ్లారు. పెళ్లికాకముందే వీరిద్దరూ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ క్లోజ్ గా దిగిన ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

ఇటలీలోని టస్కాని వెకేషన్కు వెళ్లిన ఈ జంట.. అక్కడ అందమైన ప్రదేశాలను ఆస్వాదిస్తూ.. ఒకరితో ఒకరు క్లోజ్ గా దిగిన ఫొటోస్ ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి వెకేష‌న్‌కు సంబంధించిన ఈ పిక్స్‌ వైరల్ అవ్వడంతో.. అవి చూసిన అభిమానులంతా లక్కీ కపూల్ అంటూ.. పెళ్లికి ముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారే అంటూ.. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ.. ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ విషెస్ తెలియజేస్తున్నారు.

అయితే వీరిద్దరు పెళ్లి కబురు ఎప్పుడు చెప్తారు అని ఆసక్తి కూడా ప్రేక్షకులు మొదలైంది. గత మార్చిలో సిద్ధార్థ, అధితి వనపర్తిలో ప్రముఖ దేవాలయంలో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. చాలామంది మొదట ఈ వేడుకను పెళ్లి అని భావించారు. అయితే వెంటనే తమ లవ్ బాండ్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ వారిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు రింగులు తొడుక్కున్న ఫొటోస్ ను షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు.