చిరు, బాలయ్యలతో సింగిల్ ఫ్రేమ్లో మెరిసిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?!

చిరు, బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరు నటించే సినిమాలు హిట్ అయినా కాకపోయినా.. ఈ ఇద్ద‌రికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గదు. రోజు రోజుకు వీరి క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉండడం విశేషం. ఐదు పదుల వయసు దాటిన యంగ్ హీరోలకు పోటీగా ఉన్న ఈ లెజెండ్ యాక్టర్స్ ఇద్దరిలో ఏ ఒక్కరితో ఫోటో దిగిన చాలా అదృష్టమని ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటిది ఏకంగా ఇద్దరు లెజెండ్రి నటులతో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చాడు ఈ బుడ్డోడు.

South Star Balakrishna Confirms His Son Mokshagna Teja To Debut Soon -  News18

చిరు, బాలయ్య లాంటి ఇద్దరు స్టార్ హీరోస్ ని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకువచ్చి ఫోటో స్టిల్ ఇచ్చిన ఈ పిల్లోడు ఎవరు అని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలయ్యే ఉంటుంది. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా.. అతను మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ. ఇప్పటికే బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు నందమూరి ఫ్యాన్స్ అంతా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వారి కోరిక మాత్రం నెరవేరలేదు. ఇక తాజాగా మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.

Nandamuri Mokshagna on the way to films? - TeluguBulletin.com

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడదిలోనే ఉంటుంది అంటూ గతంలో చెప్పిన బాలయ్య.. మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశాడు. తన కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడని సినిమాపరంగా తనను ఇన్స్పైరింగ్గా తీసుకోవద్దని మోక్షకు చెప్తానని.. యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడ‌వి శేష్‌ లాంటి వారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని సినిమాలలో నటించాలని ఓపెన్ గా చెప్పినట్లు చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్యకు హాటర్ హిట్లు అందించిన బోయపాటితో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండనుంద‌ని టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.