మహిళల రక్షణ కోసం పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త చట్టాలు తీసుకువచ్చి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రోజు ఏదో ఒక సంఘటన తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజాగా యువతీకి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసి ఆమె కడుపు తీయించిన ఓ సినీ నిర్మాత అరెస్టై నెటింట వైరల్ గా మారింది. చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన మూవీ ప్రొడ్యూసర్ మహమ్మద్ అలీ సినిమా నిర్మాణ సంస్థను రన్ చేస్తున్నాడు. ఈ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతని అవకాశం కోసం అంటూ ఆఫీస్ కు రప్పించారు.
ఈ క్రమంలో మాటలతో ఆమెను ట్రాప్ చేసి పాఫ్ట్ డ్రింక్ అంటూ మత్తు మందు కలిపి ఇచ్చిరేప్ చేవడు. గతమే 13న యువతి అంబత్తురులో మహిళ పోలీస్ స్టేషన్లో వేధింపులపై ఫిర్యాదు చేసింది. సినీనిర్మాణ సంస్థ నడుపుతున్న మహమ్మద్ అలీ తనకు పెళ్లి అయిందన్న విషయాన్ని దాచిపెట్టి.. నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మోసగించాడని.. నాకు తెలియకుండా సాఫ్ట్ డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపి నిన్ను రేప్ చేశాడని.. అంతేకాదు దాని వీడియో కూడా రికార్డ్ చేసి నన్ను వేధిస్తున్నాడు అంటూ చెప్పకొచ్చింది.
దీంతో నేను గర్భం దాల్చడంతో విటమిన్స్ క్యాప్సిల్ అంటూ తనతో అబార్షన్ టాబ్లెట్ మింగించాడని.. దీని గురించి చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్ని విషయాల్లో నన్ను దోపిడీ చేసి మళ్లీ బెదిరిస్తున్నాడు అంటూ.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పోలీసులు విచారణ జరపగా ఆరోపణలు నిజమే అని తెలియడంతో నిర్మాత మహమ్మద్ అలీ పై నాలుగు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం అంబత్తూర్ కోర్టులో హాజరు పరిచి అతన్ని జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారింది.