బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. కెరీర్ ప్రారంభం నుంచి సరైన సక్సెస్ ఒకటి కూడా లేదు అనటంలో అతి సయోక్తి లేదు. అయితే గ్లామర్ షో తో హద్దులు దాటి మరి నెటింట ట్రెండ్ అవుతున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కుర్రాళను కవ్విస్తూ భారీ పాపులారిటి దక్కించుకుంటుంది. ఇక ఈ అమ్మడు ఇటీవల టాలీవుడ్ దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే.
అయితే నార్త్ లో లిమిట్ క్రాస్ చేసి మరి గ్రామర్ షో చేసిన జాన్వీ.. సౌత్ ఇండస్ట్రీలో మాత్రం గ్లామర్ పాత్రలు చేయకూడదని కండీషన్స్ పెట్టుకుందంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగులో వరస పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న జాన్వీ మొదట ఎన్టీఆర్ దేవర సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరటాల శివ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది.ఈ మూవీలో పల్లె పడుచుల కనిపించనుంది జాన్వీ. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో తెరకెక్కుతున్న ఆర్ సి 16 సినిమాలను జాన్వికి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో సందడి చేసిన జాన్వి.. ఈ సినిమాలోను పల్లెటూరి అమ్మాయిల ట్రెడిషనల్ లుక్ లో కనిపించబోతుందని టాక్. టాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టింది ఇప్పుడే ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా ట్రెడిషనల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. బిగినింగ్ లోనే ఎక్స్పోజింగ్ చేస్తే పాపులారిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుందని జాన్వి ఇలా ట్రెడిషనల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. దీంతో ఆఫ్ స్క్రీన్ లో ఒకలా.. ఆన్ స్క్రీన్ లో మరోలా ఉంటున్న జాన్వి స్ట్రాటజీ అర్థం కాక షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.