ఓరి దీని వేషాలోయ్..అభిమానులకు ఊహించిన షాక్ ఇచ్చిన ప్రభాస్ బ్యూటీ..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువగా వింటూ వస్తున్నాము. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లికి సంబంధించిన వార్తలను ఎలా వైరల్ చేస్తున్నారో కూడా చూస్తున్నాము. తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతూ వచ్చింది . త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోబోతుంది అని .. ఈ ఏడాదిలో త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని .. అది కూడా ఓ స్టార్ డైరెక్టర్ ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అని ప్రచారం జరిగింది .

అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ త్రిష తన పెళ్లి వార్తపై ఖండించింది . “నాకు పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు.. కానీ మీడియా నాకు ప్రతిసారి పెళ్లి చేసేస్తుంది.. రీజన్ ఏంటో తెలియదు నేను పెళ్లి చేసుకుంటే మీకు వచ్చే ఆనందం ఏంటి? నాకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఇప్పట్లో లేదు .. ఒకవేళ పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కలిగితే ఫస్ట్ మీకే చెప్తాను ..అప్పటివరకు ఆగండి

ఒకసారి స్టార్ డైరెక్టర్ తో పెళ్లి అంటారు ..మరొక్కసారి స్టార్ హీరోతో అంటారు.. ఇంకొకసారి ప్రొడ్యూసర్ తో అంటారు.. ఏంటి ఈ పిచ్చి వార్తలు..?” అంటూ అసహనంగా మాట్లాడింది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆల్రెడీ 41 క్రాస్ చేసిన త్రిష ఇంకా పెళ్లిపై ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి ..? అంటూ జనాలు నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఆమె లో ఏమైన ప్రాబ్లమ్ నా..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు..!!