ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థానం అందుకోబోయేది ఆ హీరో నేనా..? ఫ్యాన్స్ ఊహలు మామూలుగా లేవుగా..!

ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్స్ ప్లేస్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. మారుతూ వస్తూ ఉంటుంది. ట్రెండ్ కి తగ్గట్టు ఆ హీరో హీరోయిన్స్ స్థానాలు ప్లేసెస్ మారిపోతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం . కాగా రీసెంట్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో న్యూస్ బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో మాస్ హీరో అనగానే గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించేస్తాడు. ఆది సినిమా హిట్ అవ్వడానికి ఏకైక కారణం ఎన్టీఆర్ తొడ కొట్టే విధానం అని చెప్పుకోక తప్పదు.

పలు సినిమాలలో తనదైన స్టైల్ లో నటించిన సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక మైల్ స్టోన్ క్రియేట్చేసుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . వార్ 2 సినిమాను కూడా సెట్శ్ పైకి తీసుకొచ్చాడు . త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . కాగా ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత అలాంటి ఒక స్థానం ఏ హీరోకి దక్కుతుంది అంటే మాత్రం అందరూ హీరో విశ్వక్సేన్ పేరుని జపిస్తున్నారు అభిమానులు.

హీరో విశ్వక్సేన్ తనదైన స్టైల్ లో నటిస్తూ సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ గుర్తింపు కోసం ట్రై చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా మంచి టాక్ దక్కించుకుంది. ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఈయనకు ఎన్టీఆర్లో నటించే క్వాలిటీ బాగా మ్యాచ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత స్థానం అందుకోబోయేది విశ్వక్సేన్ అంటూ పొగిడేస్తున్నారు. కొంతమంది విశ్వక్సేన్ ను ట్రోలింగ్ కూడా గురిచేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాయిని అందుకునే అంత సీన్ లేదు అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు..!!