కెరియర్ లో ఫస్ట్ టైం విలన్ షేడ్స్ లో కనిపించబోతున్న వెంకటేష్ ..ఏ సినిమాలో అంటే..?

సీనియర్ హీరోస్ తమ స్ట్రాటజీలు మార్చేస్తున్నారు . ఎప్పుడు మనమే హీరోలుగా చేస్తే జనాలకు లైక్ చేయరు అన్న నిజాన్ని గమనించారో.. లేకపోతే ఎన్నిసార్లు ఇలా చేస్తాము అని వాళ్లకు వాళ్లకే బోర్ కొట్టిందో .. కొందరు హీరోస్ మాత్రం తమ రూట్ ని మార్చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ . తాజాగా తీసుకున్న నిర్ణయం అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది .

ఇప్పటి వరకు తన కెరియర్లో చేయని బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడు వెంకటేష్. ఆయన ఓ తెలుగు హీరో సినిమా కోసం విలన్ గా మారబోతున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . హీరోగా ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన వెంకటేష్ సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించారు . మల్టీస్టారర్ మూవీస్ లో కూడా నటించారు. అయితే ఇప్పుడు విలన్  ల కనిపించబోతున్నారట.

దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . నాగచైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విరుపాక్ష డైరెక్టర్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో నెగిటివ్ షేడ్శ్ లో కనిపించబోతున్నాడట వెంకటేష్. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. మేనల్లుడి కోసం ఇంత రిస్క్ చేస్తున్నావా మామ అంటూ ఘాటు డైలాగ్స్ వాడుతున్నారు..!!