ఈసారి బాలయ్య పుట్టినరోజుకు ఆ పని చేయబోతున్నాడా? నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్..!

సాధారణంగా స్టార్ హీరో పుట్టినరోజు వస్తుంది అంటే అభిమానులు ఏ రేంజ్ లో హంగామ చేస్తారో అన్న విషయం మనకి బాగా తెలుసు . అర్ధరాత్రి నుంచి కేక్ కటింగ్ లు భారీ భారీ కటౌట్లు ఫ్లెక్సీలతో ఓ రేంజ్ లో హంగామ చేసేస్తూ ఉంటారు . అయితే బాలయ్య పుట్టినరోజు అంటే నందమూరి ఫ్యాన్స్ ఇంకా డబల్ డోస్ ఎనర్జీతో రెడీగా ఉంటారు. బాలయ్య ఎంత ఎనర్సిటిక్ గా సినిమాలో కనిపిస్తారో. అంతే ఎనర్సిటిక్ గా తన అభిమానులు సైతం ఆయన పుట్టిన రోజు ను చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు .

పలువురు కేక్ కటింగ్ చేసి బాలయ్య బర్త డే ను సెలబ్రేట్ చేసుకుంటే ..మరికొందరు అన్నదానం చేసి బాలయ్య పేరు చెప్పి ఆ హ్యాపీనెస్ ని పంచుకుంటూ ఉంటారు . బాలయ్య పుట్టినరోజుకి ఈసారి సరికొత్త ప్లాన్ చేయబోతున్నారు అన్న న్యూస్ వైరల్ గా మారింది. ప్రతిసారి బాలయ్య తన బర్త్డ డేను ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు . అయితే పర్సనల్గా ఫ్యామిలీతో ఒకలా ఫ్యాన్స్ తో సెలబ్రేట్ చేసుకునే బాలయ్య ఫ్యాన్స్ తో మరొకలా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఫస్ట్ టైం ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి ఒకే స్టేజిపై తన బర్త్డ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట . అంతేకాదు మోక్షజ్ఞ – తేజస్విని – బ్రాహ్మిని – వసుంధర తన మనవళ్ళు అందరూ కూడా ఈ పార్టీలో పాల్గొనే విధంగా ప్లాన్ చేశారట . ఒక కన్ను కుటుంబం అయితే ఒక కన్ను ఫాన్స్ అని భావించే బాలయ్య తన బర్త డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!