ప్ర‌భాస్ ఇంటినుంచి ఫుడ్ వ‌స్తేనే అలా చేస్తా.. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు శ్ర‌ద్ధా ఇంట్ర‌స్టింగ్ రిప్లై..?!

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న ప్రభాస్.. ప్రస్తుతం కల్కి మూవీ ప్రమోషన్స్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రభాస్ ఫుడ్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతమంది సెలబ్రిటీస్ నోటి నుంచి వింటూనే ఉన్నాం. సినిమా సెట్స్ లో హీరోయిన్స్, ఆర్టిస్టులకి ప్రభాస్ అప్పుడప్పుడు ఫుడ్ తినిపిస్తూ వారిని దిల్ ఖుష్‌ చేస్తూ ఉంటాడు. ప్రభాస్ ఫుడ్ తో చేసే మర్యాదలతో ఆశ్చర్యపోయిన సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు.

Post 'Saaho' failure, Prabhas says 'No' to Hindi version of his movies |  Hindi Movie News - Bollywood - Times of India

ఇప్పటిదాకా ప్రభాస్‌తో పని చేసే ప్రతి హీరోయిన్ ప్రభాస్ పెట్టిన ఫుడ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ మరోసారి ప్రభాస్ ఫుడ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌తో ఈ అమ్మడు సాహో సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ టైంలో శ్రద్ధాకు, ప్రభాస్ చాలాసార్లు ఇంటి నుంచి ఫుడ్ తెప్పించి పెట్టాడట. అయితే తాజాగా శ్రద్ధ కపూర్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోని షేర్ చేయగా దానిపై స్పందించిన నెటిజ‌న్ మరోసారి ప్రభాస్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు.

దీనికి శ్రద్ధ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. ప్రభాస్ మళ్ళీ తన ఇంటి నుంచి ఫుడ్ పంపినప్పుడు అతని సినిమాలో నటిస్తానంటూ కామెంట్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్ నెటింట వైరల్ అవుతుంది. సాహో సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయిన కూడా.. ఇంకా ప్రభాస్ పెట్టిన ఇంటి ఫుడ్ గురించి ఆమె మర్చిపోలేదంటే.. ఏ రేంజ్ లో ఆయన తన ఆతిథ్యం చూపించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు అంటూ.. ప్రభాస్ ఫుడ్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి తప్పేముంది అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.