సోషల్ మీడియాలో కని విని ఎరుగని సంచలన రికార్డ్.. బన్నీ గాడి స్కెచ్ కి ఆల్ వికెట్స్ అవుట్..!

ఇంస్టాగ్రామ్ అందుబాటులోకి వచ్చాక ఏ సినిమా నుంచి పాట రిలీజ్ అయిన.. టీజర్ రిలీజ్ అయిన .. డైలాగ్స్ రిలీజ్ అయిన ఇన్స్టా లో రీల్స్ చేసే వాళ్ళ లిస్ట్ ఎక్కువగా మారిపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా అది పాన్ ఇండియా రేంజ్ హీరో సినిమా అయితే సెకండ్స్ లోనే ఆ పాట వైరల్ అయిపోతుంది. రీసెంట్గా అలా వైరల్ అయిన పాటే “సూసేకి అగ్గి రవ్వ మాదిరి “..టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ .. నేషనల్ క్రష్ హీరోయిన్ రష్మిక మందన్నా నటించిన తాజా సినిమా పుష్ప2.

ఈ సినిమాలోని పాటే ఈ సూసేకి అగ్గి రవ్వ మాదిరి పాట.. పుష్ప 2 సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ పాట అభిమానులను బాగా ఆకట్టుకునేసింది. మరీ ముఖ్యంగా కపుల్ స్టెప్ అయితే అద్దిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే పలువురు ఇంట్రెస్టింగ్ గా ఈ రీల్ ని చేయడం మొదలుపెట్టారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో పుష్ప2 సెకండ్ సాంగ్ కపుల్స్ స్టెప్ సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది .

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష రీల్స్ ఈ స్టెప్ పై రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఏ పాటకి ఇంత తక్కువ టైంలో ఇన్ని రీల్స్ రికార్డ్ కాకపోవడం గమనార్హం . అలాంటి క్రేజ్ రికార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా పుష్పరాజ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. సూసేకి అగ్గి రవ్వ మాదిరి సాంగ్ సినిమాకే హైలెట్ గా మారబోతుంది అంటున్నారు అభిమానులు . అంతేకాదు కపుల్ స్టెప్ చాలా చాలా నాటిగా డిజైన్ చేశారు కొరియోగ్రాఫర్ అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!