చ‌ర‌ణ్ – ఉపాస‌నల లిటిల్ ప్రిన్సెస్‌కు ‘ క‌ల్కి ‘ బుజ్జి గిఫ్ట్‌.. క్యూట్ పిక్స్ వైర‌ల్..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే వీరి గారాల పట్టి క్లీన్ కారా ఫేస్ ఇప్పటివరకు రివీల్ చేయకపోయినా.. ఈ క్యూటీ కి కూడా నెటింట‌ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ చిన్న‌దానికి ప్రభాస్ నటించిన కల్కి టీం నుంచి అద్భుతమైన గిఫ్ట్ వచ్చింది. పాన్ ఇండియ‌న్ స్టార్ట్ ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ కాంబోలో తెర‌కెక్క‌నున్న‌ కల్కి 2898 ఏడీ మూవీలో బుజ్జిని ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ గ్రాండ్ ఈవెంట్ ద్వారా బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రమోషన్ లో భాగంగా సరికొత్తగా ఈ సినిమాలో క్యారెక్టర్ తో కాకుండా.. ప్రభాస్ వాడిన వెహికిల్ తో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

Ram Charan and Upasana celebrate 1st Christmas with daughter Klin Kaara -  India Today

ఈ వెహికల్ బుజ్జి అనే చిన్న రోబోట్ తో సినిమా హైప్‌ పెంచే ప్రయత్నాలు చేశారు. అలాగే తాజాగా బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యానిమేషన్ సిరీస్ పిల్లలను బాగా ఆకట్టుకునేలా మూవీ టీం ప్లాన్ చేశారు. బుజ్జి, బైరవ స్టిక్కర్స్, బొమ్మలు, టీషర్ట్స్ కూడా అమ్మకాలు మొదలయ్యాయి. అలాగే కొంతమంది ఫ్రీగా కూడా వీటిని ఇస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పిల్లలకు కల్కి మూవీ టీం నుంచి బుజ్జి అండ్ భైరవ స్పెషల్ గిఫ్ట్ లు పంపించారు మేకర్స్‌. అందులో భాగంగానే క్లిన్‌కార కు కూడా ఈ బుజ్జి కారును గిఫ్ట్ గా పంపించారు మేకర్స్.

Ram Charan s daughter Klin Kaara has found new friend in Prabhas

ఈ గిఫ్ట్ లో ఆ వెహికల్ బొమ్మ, బుజ్జీ రోబో బొమ్మ, కొన్ని స్టిక్కర్స్, కొన్ని పోస్టర్ ఒక లెటర్ కనిపించాయి. క్లిన్ కారా బుజ్జి వెహికల్ తో ఆడుకుంటున్న ఫోటోని ఉపాసన తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంటూ.. కల్కి టీం కి ధన్యవాదాలు అలాగే ఆల్ ది బెస్ట్ అంటూ వివరించింది. దీంతో ఈ ఫోటో నెటింట వైరల్ గా మారింది. అయితే ఇప్పటికి క్లిన్‌కార ఫోటోను మాత్రం రివిల్ చేయకుండానే ఈ పిక్ షేర్ చేశారు. అలాగే ఈ బుజ్జి రోబో కిట్‌ మరి కొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా గిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.